Wednesday, 30 January 2013

శంకట హర గణేశ స్తోత్రం - శంకష్ట నాశన స్తోత్రం

నారద ఉవాచ
ఓం ప్రణమ్య శిరసా దేవం గౌరీ పుత్రం వినాయకమ్,భక్తావాసం స్మరేన్నిత్యం  ఆయుః కామార్థ సిద్దయే ! (1)
ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్,తృతీయం కృష్ణ పింగాక్షం గజవక్తమ్ చతుర్ధకమ్ (2)
లంబోదరం పంచమం చ, షష్టం వికటమేవ చ,సప్తమం విఘ్నరాజాం చ, ధూమ్రవర్ణం తధాష్టమమ్ (3)
నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకమ్,ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననమ్ !!   (4)
ద్వాదశైతాని నామాని త్రీ సంధ్యం యః పఠేన్నరః ,న చ విఘ్న భయం తస్య, సర్వసిద్ధి కారకం ప్రభో!  (5)
విద్యార్థి లభతే విద్యం ధనార్ధి లభతే ధనమ్,పుత్రార్థి లభతే పుత్రాన్, మోక్షార్ధి లభతే గతిమ్ (6)
జపేత్ గణప్‌తిస్తోత్రం, షడ్బిర్మాసై :ఫలం లభేత్,సంవత్సరేణ సిద్ధీం చ లభతే నాత్ర సంశయ: !   (7)
అష్టభ్యో బ్రహ్మనెభ్యశ్చ, లిఖిత్వాం యః సమర్పయేత్,తస్య విద్యా భవేత్ సర్వా, గణేశస్య ప్రసాదత: !!   (8)
ఇతి శ్రీ నారద పురాణే సంకట నాశన గణేశ స్తోత్రం సంపూర్ణం ||
సేకరణ: తెలుగు డివొషనల్ ఒన్లీ

Monday, 7 January 2013

మేలుకొలుపు

అక్బరుద్దీన్‌ ఒవైసీకి నేను మనసారా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. శరీరంలో స్థిరపడి దానిని నయం చెయ్యాలని

 కూడా గ్రహించని, చెయ్యనక్కరలేదని భావించిన అలసత్వానికి గుర్తుగా వికటించి బయటపడిన కేన్సర్‌ అక్బరుద్దీన్‌ 

ఒవైసీ. ఇప్పుడు బయటపడినా చికిత్సకి లొంగని చావుకి గుర్తు ఈ 'కేన్సర్‌'. అయితే అంత దయనీయమైన దశలో 

ఉన్నదా హిందూదేశం? హిందూమతం?

మన మతానికి విస్తృతి ఎక్కువ. ఔదార్యం ఎక్కువ. జాలి ఎక్కువ. సంయమనం ఎక్కువ. అన్నిటికీ మించి 


అలసత్వం ఎక్కువ. బట్టల్లేని సీతమ్మనీ, నగ్నంగా నిలిపిన భరతమాతనీ చూసికూడా తన తల్లికి బట్టలు తొడిగిన 

ఎమ్‌.ఎఫ్‌.హుస్సేన్‌గారి కళాస్వేచ్ఛని నెత్తికెత్తుకునే కళాతృష్ణ మనది. 'మతం' గురించి ఎవరు మాట్లాడినా, దేవుడిని 

వెనకేసుకొచ్చినా 'హిందుత్వ'మని కత్తులు దూసే సెక్యులర్‌ కవచాలు తొడుక్కున్న ఆత్మవంచన చేసుకునే 

అవకాశవాద పార్టీలున్న దేశం మనది. మనం నలుగురు ముస్లిం పెద్దల్ని రాష్ట్రపతుల్ని చేసుకున్నాం. ఇద్దరు 

ముస్లింలను ఉపరాష్ట్రపతుల్ని చేసుకుని గౌరవించుకున్నాం. మరే ముస్లిం దేశంలోనూ ఏ హిందువూ ఏ 

విధమయిన పదవిలోనూ నిలిచిన దాఖలాలు లేవు. నెదర్లాండులో తమ దేవుడిని వెక్కిరించే కార్టూన్లు వేస్తే 

ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ ఆస్తులూ, ఇళ్లూ తగలెట్టారు. తమ దేవుడిని దూషించిన ముస్లిం రచయితనే 

చంపాలని మరో దేశపు మతగురువు శాసిస్తే -యిప్పటికీ సాల్మన్‌ రష్దీ రహస్యపు బతుకు బతుకుతున్నాడు. మనం 

చిత్రగుప్తుడిని, యముడినీ (రెండు 'యముడికి మొగుడు' సినీమాల్ని చూసి సంతోషించాం) శ్రీకృష్ణుడినీ, నారదుడినీ 

ఆటపట్టిస్తే ప్రేక్షకులు వందరోజులు చూసి ధన్యులవుతారు. బ్రాహ్మణ్యాన్ని గర్హించి -వాళ్ల చేత పేడ తినిపిస్తే -

బ్రాహ్మణతరులు కిల కిల నవ్వుకుంటారు. ముస్లింలలో అలాంటి పరాచికాలు ఎప్పుడయినా ఎవరయినా చేసిన 

దాఖలాలు ఉన్నాయా? చేసి బతికి బట్టకట్టగలరా?

ఈ దేశంలో ముస్లిం సోదరులంతా ఒకటి. ఎక్కడ ఉన్నా ఒకటిగా ఓటు వేస్తారు. అయిదేళ్ల ఆడపిల్లకి బురఖా వేస్తారు. 

అరవైయ్యేళ్ల ముసలాయనా టోపీ పెడతారు. తమని కాదంటే పదేళ్ల పిల్లనీ కాల్చి చంపుతారు. మతం పట్ల గౌరవం, 

మరొక పక్క భయం - వారిని సంఘటిత పరుస్తుంది.

మనదేశంలో మనం మహారాష్ట్రులం, తమిళులం, బెంగాళీలం, వెనుకబడిన వారం, ముందుబడినవారం, 

కులాలవారం, రెడ్లం, కమ్మవారం, కాపులం, బ్రాహ్మణులం, శ్రీవైష్ణవులం, శైవులం, మాలలం, మాదిగలం -మనం 

సామూహిక ప్రతిపత్తిని ఏనాడూ ప్రకటించుకోము. ఎవరూ ఎవరిమాటా వినరు. ఎవరి ప్రయోజనాలు వారివి. 

ఎవరయినా ఎప్పుడయినా ముస్లింలకు ప్రాతిపదిక మతం. మనకి? వ్యక్తిగత ప్రయోజనం, స్వలాభం, డబ్బు, పదవి, 

ఎదుటివాడి పతనం -మరేదో, మరేదో.


హిందూదేశంలో ముస్లింల 'హజ్‌' యాత్రకి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది. ప్రపంచంలోని 52 ముస్లిం దేశాలలో 

ఏ దేశంలోనూ ఈ ఉపకారం లేదు. శుభం. మరి భారతదేశంలో కాశీ, గయ, కేదార్‌, బదరీ, వైష్ణోదేవి యాత్రలకు మన 

ప్రభుత్వం ఆర్థిక సహాయం చెయ్యదేం? అడిగే నాధుడేడీ? వాళ్ల స్వార్దాలకే వ్యవధి చాలకపోయె. మన చిన్న పొట్టకు 

శ్రీరామరక్ష. మన కులానికి మేలు కలిగితే చాలు. మొన్న విశాఖపట్నంలో ఓ స్వామీజీని బహిరంగంగా కొట్టారు. 

కారణమేదయినా ఈ పనిని ఏదీ? ఒక 'ఇమామ్‌'కి దమ్ముంటే చేయమనండి. మనది భారతదేశం. పరాయి పెద్దని 

అవమానించమనడం ఉద్దేశం కాదు. మన మర్యాదకి నీడలేదని చెప్పడం ఉద్దేశం.
అక్బరుద్దీన్‌ చేసిన ప్రసంగం ఏ హిందువయినా చేసి బతికి బట్టకట్టగలడా? ముస్లింలు మాట దేవుడెరుగు. ఔదార్యం 

కట్టలు తెంచుకునే మన సెక్యులర్‌ వీరులు 'హిందుత్వం' పేరిట గొంతుచించుకోరా? అక్బరుద్దీన్‌ అరాచకాన్ని 

ఉత్తరప్రదేశ్‌లో మరో ముస్లిం నాయకుడు సమర్థించారు! హిందూ దేశంలో ముస్లింల కిచ్చిన ప్రత్యేక స్థానం మరే 

ముస్లిం దేశంలోనయినా హిందువుల కిచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఈ దేశంలో 15 శాతం మైనారిటీ వర్గాన్ని 85 

శాతం మెజారిటీ వర్గం నెత్తిన పెట్టుకుంటోంది.

కరుణానిధికి రామాయణం కట్టుకథ. ఆయన మన ముఖ్యమంత్రి. దేవుడిని నమ్మని, నమ్మకం లేదని బల్లగుద్దే ఏ 

ముస్లిమయినా ఏ ముస్లిం దేశంలో నయినా నాయకుడు కాగలడా?
ఈ విచిత్రాన్ని ఎవరయినా గమనించారా? గాజాలో అరబ్బులు క్షేమంగా లేరు. పాకిస్తాన్‌లో వందలమంది 

ముస్లింలను వారే చంపుకుంటున్నారు. లిబియాలో, మొరాకోలో, ఆఫ్గనిస్థాన్‌లో, సిరియాలో, లెబనాన్‌లో, 

ఈజిప్టులో, ఇరాక్‌లో, యెమెన్‌లో ముస్లింలు హింసకు బలి అవుతున్నారు. ఆస్ట్రేలియాలో, ఇంగ్లండులో, ఫ్రాన్స్‌లో, 

ఇటలీలో, జర్మనీలో, స్వీడన్‌లో, అమెరికాలో, నార్వేలో వారు క్షేమంగా, హాయిగా ఉన్నారు. అయినా ఆ దేశాల్లో 

ముస్లింలు పై దేశాల్లో ముస్లింలుగా ఉండాలనుకుంటున్నారు.
మహారాష్ట్రలో, ఉత్తరప్రదేశ్‌లో, బీహార్‌లో ముస్లింలు మైనారిటీలుగా రాయితీలు పొందుతున్నారు. శుభం, మరి ఈ 

దేశంలోనే జమ్ము కాశ్మీర్‌లో, మిజోరంలో, నాగాలాండ్‌లో, అరుణాచల్‌ప్రదేశ్‌లో, మేఘాలయలో మైనారిటీలయిన 

హిందువులకు ఆ రాయితీలు యివ్వడం లేదేం?
ముస్లిం మత కార్యకలాపాలను, వారి వ్యవహారాలను చూసే వక్ఫ్‌ బోర్డులున్నాయి. వాటి ఆదాయాన్ని ఈ దేశంలో 

ఎవరయినా ముట్టుకోగలరా? పదిమంది దర్శించే ప్రతి హిందూ దేవాలయ పరిపాలనా, ఆదాయం -రాజకీయ 

నాయకుల, వారి ప్రతినిధుల చేతుల్లోకి పోయిందేం?
ఎవరయినా మనల్ని తిట్టినప్పుడు -మనం హిందువులం. ఎవరూ తిట్టనప్పుడు -మనల్ని మనమే తిట్టుకునే 

స్వదేశీయులం. అదీ మన ప్రతాపం.
'మనవాళ్లు ఉత్త వెధవాయిలోయ్‌!' అన్నాడు గిరీశం. అక్బరుద్దీన్‌ వంటి పెద్దలు ''వీళ్లంతా ఉత్త వెధవాయిలోయ్‌!'' అని 

నవ్వుకుని ఉంటారు. అందుకే రొమ్ము విరుచుకుని -ప్రేక్షకులు మురిసిపోయేలాగ -హిందూ దేశంలో హిందువుల్ని 

తిట్టి -తీరిగ్గా లండన్‌ వెళ్లి కూర్చున్నారు. ఇక్కడ మన వీరంగం చూసి -అక్కడ పేపర్లలో చదువుకుని నవ్వుకుంటూ 

ఉండి ఉంటారు.
కులాల పేరిట, వర్గాల పేరిట -కిష్టిగాడు, రాములు వెధవ, సీతి, లచ్చి స్థాయికి మతాన్ని యీడ్చిన గౌరవనీయులైన 

హిందువులు -మొదట ఇల్లు చక్కబెట్టుకోవలసిన అవసరం ఎంతయినా ఉంది. తమలో ఏ లోపాలున్నా 'మతం'- 

భేషరతుగా -నయానికో, భయానికో -తమకి గుర్తింపునీ, బలాన్నీ, సామూహిక ప్రతిపత్తినీ యివ్వగల శక్తి అని 

ముస్లింలు నమ్ముతున్నారు. మనం ఏనాడయినా -ఎవరో మనని దుయ్యబట్టిన యిలాంటి అరుదయిన సందర్భాల్లో 

ప్రథమ కోపాన్ని చూపడం తప్ప -యిలాంటి సంఘటిత శక్తిని ప్రదర్శించామా?
అక్బరుద్దీన్‌ తప్పు చేశాడా? ఇప్పుడు క్రైస్తవ మతాన్ని సహాయం తెచ్చుకుంటాను. మీ మతాన్ని, మీ విలువల్ని, మీ 

విశ్వాసాల్ని, మీ ఆచారాల్ని గౌరవించే మొనగాడెవరయినా ఉంటే మొదటి రాయి వెయ్యండి.
నా ఉద్దేశంలో అక్బరుద్దీన్‌ ప్రసంగం మేలుకొలుపు. పేడ తినే బ్రాహ్మణ్యం, యముడిని వెక్కిరించే సినిమాలూ, 

స్వజనాన్ని గౌరవించుకోలేని స్వార్థం, వేలంటీన్‌ వేలం వెర్రికి విర్రవీగే సామూహిక పైత్యం, దేవుడు, దేవాలయాలు 

'హిందుత్వం' అని రాజకీయ ప్రయోజనాలకు గొంతు చించుకునే అవకాశవాద పార్టీలూ మతానికి విలువని పెంచవు. 

అక్బరుద్దీన్‌ వంటి వారి నోటికి బలి అవుతాయి. అంతకంటే భయంకరమైన విషయం ప్రేక్షకుల ప్రశంస అనే హెచ్చరిక


సేకరణ: మారుతీయం

కాళిదాసు - అభిజ్ఞాన శాకుంతలం

కాళిదాసు - అభిజ్ఞాన శాకుంతలం

ఈ పేరు తలుచుకుంటేనే ఏదో క్రొత్త ఉత్సాహం. సాధారణంగా నేను వ్రాయబోయే టపాల శీర్షికలు ముందుగా చెప్పను. కానీ దీని గురించి ఇంతకు ముందే చెప్పేశాను. మొదట్లో నేను కాళిదాసు రచనలన్నీ చదివి ఆయన గురించి ఒక ప్రత్యేక టపా వ్రాయాలి అనుకున్నాను. నా పిచ్చి కానీ అంతటి మహానుభావుని గురించీ, ఆయన వ్రాసిన ఒక్కో రచన గురించీ చెప్పడానికి మిడి మిడి జ్ఞానం ఉన్న నాకే ఒక టపా చాలట్లేదు అంటే పూర్తిగా అర్థమయ్యి ఉంటే ఆయన వ్రాసిన ఒక్కో రచనలో ఒక్కో శ్లోకానికీ ఒక్కో టపా వ్రాసేదానినేమో! ఆయన గురించి మామూలు మాటల్లో తెలుసుకోవటం కంటే ఆయన రచనల్లో ఆయనని ముందు తెలుసుకోవడం మంచిదని నా ఉద్దేశ్యం. ప్రస్తుతానికి నా పరిధి మేరకు ఆయన ఒక్కో రచననీ పరిచయం చేస్తూ నా అభిప్రాయాలు, అన్వయాలు, ఆలోచనల మేళవింపుతో కాళిదాసుని మీ ముందుకి తెచ్చే ప్రయత్నం చేస్తాను. 


ఈయన రచనల్లో ఇది బాగుంది, ఇది బాలేదు అని చెప్పడానికేమీ లేదు (అలా చెప్పడానికి నాకున్న జ్ఞానం సరిపోదు) కానీ ఈ అభిజ్ఞాన శాకుంతలం నన్ను ఎక్కువగా ఆకర్షించింది. ఇది "శృంగార రస" ప్రధానమయిన నాటకం. ఈ కథ అందరికీ బాగా తెలిసినదే కనుక సూక్ష్మంగా చెప్పుకుంటే: హస్తినాపుర రాజయిన దుష్యంతుడు వేటకు వెళ్ళినపుడు కణ్వ మహర్షి ఆశ్రమంలో శకుంతలని కలిసి, ప్రేమించి,
గాంధర్వ వివాహం చేసుకుంటాడు. కొంతకాలం ఆమెతో ఉన్నాక రాజ్యానికి తిరిగివెళుతూ రాజముద్రికను గుర్తుగా ఇస్తాడు. భర్త గురించిన తలపులతో, విరహంలో ఉన్న సమయంలో ఆశ్రమానికి వచ్చిన దూర్వాస మునిని సరిగా ఆదరించక పోవడంతో ఎవరిగురించయితే ఆలోచిస్తూ నన్ను అశ్రద్ధ చేసావో వారు నిన్ను పూర్తిగా మర్చిపోతారనీ, ఏదయినా గుర్తు చూసినప్పుడే గుర్తువస్తావనీ శకుంతలని శపిస్తాడు. నిజానికి ఈ శాప విషయం కూడా ఆమె వినకుండా భర్త గురించే ఆలోచిస్తూ పరధ్యానంగా ఉంటుంది. ఇవన్నీ కణ్వ మహర్షి ఆశ్రమంలో లేని సమయములో జరిగినందున తిరిగివచ్చిన మహర్షి జరిగినదంతా తెలుసుకుని శకుంతలను అత్తవారింటికి పంపుతాడు. రాజు వద్దకు వెళ్తున్న శకుంతల నదిలో ఈ రాజముద్రికని కోల్పోవడం, రాజు ఈమెను గుర్తించక నిరాకరించడం, మేనక ఆమెను తీసుకెళ్ళిపోవడం, కశ్యప ప్రజాపతి ఆశ్రమంలో చేరటం, ఇలా చాలా జరిగి ఒక చేపలవాని వలలో చిక్కిన ఈ రాజముద్రికని రాజు వద్దకు తీసుకెళ్లడం, అప్పుడంతా గుర్తువచ్చిన దుష్యంతుడు శకుంతలని తన వద్దకు తీసుకుని వచ్చి వారి కుమారుడైన భరతునికి పట్టాభిషేకం చేయటం జరుగుతాయి.

ఈ నాటకంలో నాకు శృంగారం కన్నా ధార్మిక సూత్రాలు ఎక్కువగా కనిపించాయి (పుర్రెకో బు
ద్ధి, జిహ్వకో రుచి అన్నారు కదా!). ప్రతీ రచనా శ్రీకారానికి ప్రోద్బలం ఉంటుంది అన్నట్టుగా ఒక రోజున భోజమహారాజు కాళిదాసుని శాకుంతలాన్ని రచించమని అడుగగా ఈయన "శాకుంతలంలోని నాయకుడయిన దుష్యంతుడు ధీరోదాత్తుడు కానందున నేను వ్రాయను" అంటారు. ఇక్కడ మనకు కాళిదాసు రచనలో పాత్రలకి కూడా ఎంత చక్కని గుణాలని ఆపాదించాలని చూస్తాడో అనిపిస్తుంది. తన భార్యాబిడ్డల్ని ఎక్కడ లోకం అనుమానిస్తుందో, అవమాన భారం మొయ్యాల్సివస్తుందో అన్న భయంతో (లోకానికి వారు నిజంగా తనవారే అని అశరీరవాణితో చెప్పించడానికి అలా చేశాడు అని కొందరి సమర్ధన) తన వారు కాదని చెప్పిన దుష్యంతుడిని నాటకంలో నాయకుడిని చేయలేను. అయినా రాజు అడిగినందున ఆయన ముచ్చట తీర్చడానికి తను రాజీ పడలేక ఒక శాపం పొందినట్టు, ముద్రిక చూడటం వలన అంతా మళ్ళీ గుర్తుకు వచ్చినట్టు కల్పించి, నాయకుని లక్షణాలను ఆపాదించి, అభిజ్ఞాన శాకుంతలం అని నామకరణం చేశాడు. అభిజ్ఞానం అనగా ఒక గుర్తు (ఇక్కడ కథలో రాజ ముద్రికే గుర్తు). అందువలననే దీనిని కేవలం శాకుంతలం అని కాక అభిజ్ఞాన శాకుంతలం అనాలి. 
"కావ్యేషు నాటకం రమ్యం నాటకేషు చ శకుంతలా
తస్యాంచ చతుర్ధ్వాంకః తస్మిన్ శ్లోక చతుష్టయం"
అన్నట్టుగా కావ్యాలకంటే నాటకాలు రమ్యంగా ఉంటాయి. నాటకాలలో శాకుంతలం, అందులో మళ్ళీ నాల్గవ అంకము, అందులో కూడా శ్లోక చతుష్టయం (ఇది వినగానే నాకు దుష్ట చతుష్టయం గుర్తుకొచ్చింది :)) అద్భుతమయినవి. శ్లోక చతుష్టయం అంటే నాలుగు శ్లోకాలు. ఈ నాలుగూ కూడా కణ్వ మహర్షి చెప్పిన సందర్భంలోవే. ఏమిటా శ్లోకాలు? ఎందుకవి అంత గొప్పవి అంటే వాటిని చదవ వలసినదే:
పాతుం న ప్రధమం యవస్యతిజలా యుష్మాస్వపీ తేషుయా
నాదత్తే ప్రియమండనాపి భవతాం స్నేహే నయా పల్లవం
ఆజ్యేవః కుసుమ ప్రసూతి సమయే యస్యాభవత్యుత్సవః
సేయం యాతి శకుంతలా పతిగృహం సర్వైరనుజ్ఞాయతాం
మనిషికీ ప్రకృతికీ ఉండే బంధాన్ని ఎంత చక్కగా చెప్పాడో కదా కాళిదాసు! మొక్కలకి నీళ్ళు పోయకుండా తను మంచినీళ్ళు కూడా త్రాగేది కాదు, చిగురుటాకులను అలంకరించు కోవటం ఎంత ఇష్టమయినా సరే తుంచేది కాదు, తాను పెంచిన మొక్కకి పువ్వు పూస్తే పిల్లలు పుట్టినంత ఆనందించి ఉత్సవం చేసేది, అటువంటి శకుంతల అత్తవారింటికి వెళుతోంది కనుక మీరు అనుజ్ఞని ఇవ్వండి అంటాడు కణ్వ మహర్షి. ఈ శ్లోకంలో మొక్కలని సాటి మనిషిగా, అతిధిగా, సన్నిహితులుగా, బంధువులుగా చూపటం జరిగింది. వృక్షో రక్షతి రక్షితః అని మనం అనడమే తప్ప ఏనాడయినా ఇంత మమకారం చూపించామా? అనిపిస్తుంది నాకయితే.
యాస్యత్యజ్య శకుంతలేతి హృదయం సంస్పృష్ట ముత్కంఠయా
కంఠస్థంబిత బాష్పవృత్తి
కలుషశ్చింతా జడం దర్శనం
వైక్లవ్యం మమతావదీ దృశ మిదం స్నేహాదరణ్యౌ కసః
పీడ్యంతే గృహిణః కథంనుతనయా విశ్లేష దుఃఖైర్నవైః

నా కూతురయిన శకుంతల అత్తవారింటికి వెళుతుంటే బాధతో కంఠం పట్టేసి నోట మాట రావటం లేదు, కంటిలో నీరు చేరి చూపు కనిపించటం లేదు, అంతా జడంగా, నిర్జీవంగా అనిపిస్తోంది. మునివృత్తిలో ఏ బంధాలూ లేకుండా ఉండే నాకే ఇంత బాధగా, మనసంతా ఏదోలా ఉందే అదే గృహస్థులకి కూతురిని అత్తవారింటికి పంపేటప్పుడు ఇంకెంత బాధాకరంగా ఉంటుందో కదా! అని ఆలోచిస్తాడు కణ్వ మహర్షి. ఒక ప్రక్కన తను బాధపడుతూనే వేరే వారి పరిస్థితి ఏమిటి అన్న ఆలోచన కూడా కణ్వ మహర్షిలో కలిగినట్టు చూపెడతాడు కాళిదాసు. ఒక తండ్రికి అత్యంత బాధ కలిగే సమయం ఇదే అంటారు అందుకేనేమో!

అస్మాన్ సాధు విచింత్య సంమ్యమధనాన్ ఉచ్ఛైః కులంచాత్మనః
త్వైయస్యాః కథమప్యబాంధవ కృతాం స్నేహ ప్రవృత్యించతాం
సామాన్య ప్రతిపత్తి పూర్వక మిదం దారేషు దృశ్యాత్వయా
భాగ్యా యత్త మతః పరం నఖలుత ద్వాత్యం వధూబంధుభిః

కూతురితో రాజయిన అల్లుడికి కణ్వ మహర్షి పంపే సందేశమే ఈ శ్లోకం. నేను సారెలు, కట్నకానుకలు ఇవ్వలేదు. ముని వృత్తిలో ఉన్న మాకు తపస్సు, నీతి నియమాలే ధనం. రాజువయిన నీకు ఇంతకన్నా గొప్ప ధనాన్ని (నీ తాహతుకు తగ్గట్టు) మేము ఇవ్వలేము. కావున అవేమీ ఇవ్వలేదని మా అమ్మాయిని సాధించకు, డబ్బు,నగలు లేవని తృణీకార భావంతో చూడకు. మీది పెద్దలు కుదిర్చిన పెళ్లి కూడా కాదు. స్నేహభావంతో, అనురాగంతో మీరిరువురూ గాంధర్వ వివాహం చేసుకున్నారు కనుక మా అమ్మాయి నచ్చలేదు అని ఏ నాడూ అనకు. నీకు చాలా మంది భార్యలున్నా (బహు భార్యత్వం ఆ కాలంలో సహజమే) వారితో సమానంగా చూడు. వారికన్నా బాగా చూసుకుంటాను అంటే అది శకుంతల భాగ్యం కానీ నేను మాత్రం వారికన్నా బాగా చూడమని చెప్పకూడదు అని ఈ శ్లోక సారాంశం. నన్నెంతగానో కదిల్చింది. ఎంత ముందుచూపు ఆ తండ్రికి? నీతి నియమాలు, సత్ప్రవర్తనకి మించిన ధనం ఉంటుందా? ఈ విషయం ఈ కాలం వారు గ్రహించి ఆచరిస్తే ఎంతో మంది స్త్రీలు కట్న పిశాచికి బలి కాకుండా ఉండేవారేమో కదా! అనిపించింది.
సుశ్రూషస్వ గురూన్ ప్రియసఖీ వృత్తిం సపత్నీజనే
భర్తుర్విప్ర కృతాపి రోషణతయా మాస్మం ప్రతీ పంగమః
భూయిష్ఠం భవ దక్షిణా పరిజనే భాగ్యేష్వనుత్సేకినీ
యాంత్యేవం గృహిణీ పదం యువతయో వామాః కులస్యాధయః
ఇంతకు ముందు చెప్పిన శ్లోకంలో అల్లుడు కూతురిని ఎలా చూసుకోవాలో చెప్పిన కణ్వ మహర్షి ఈ శ్లోకంలో ఆడపిల్ల అత్తవారింట ఎలా ఉండాలో చెప్పాడు. పెద్దలకి (అత్తమామలకీ, మొ..వారికి) సేవ చెయ్యి, సవతులతో స్నేహంగా ఉండు, భర్త కోపంలో ఒక మాట అన్నా రోషం తెచ్చుకోకుండా అతనితో సామరస్యంగా ఉండు, సేవకుల యందు దయకలిగి ఉండు వారిని ఏ నాడూ తక్కువగా చూడకు, భోగ భాగ్యాలున్నాయి అన్న ఉద్వేగంతో గర్వం దరిచేరకుండా చూసుకో. ఇలా ఉన్నప్పుడే యువతులు గృహిణీ స్థానం పొందుతారు లేదా చెడ్డ పేరు తీసుకువస్తారు అని చెప్తాడు. ఒక్కో మాట ఒక్కో ఆణిముత్యం. తప్పక ప్రతీ ఒక్కరూ ఇవన్నీ పాటిస్తూ ఆచరణలో పెట్టగలిగితే (?) ఈ కాలంలో విడాకులు అనేవి ఉండేవి కావేమో! అనిపిస్తుంది.

ఈ నాలుగు శ్లోకాలూ అమోఘం. కాళిదాసు ఇవన్నీ ఈ కాలంలో పరిస్థితులు ఇలా ఉంటాయన్న ముందుచూపుతో ఇవన్నీ వ్రాశాడో, లేక మామూలుగానే వ్రాశాడో తెలియదు కానీ ప్రపంచం ఎంతగా మారిపోయినా ప్రతీ ఒక్కరూ తప్పక గుర్తుంచుకోవలసిన మాటలు కదూ! అందుకేనేమో ఇవి శ్లోక చతుష్టయం అంటూ అంతటి గొప్ప స్థానాన్ని పొందాయి. 

 
ఈ నాటకమంతటిలో నాకు కాళిదాసు జనాలకి ఎక్కువ ఉపదేశాలు చేశారనిపిస్తుంది. ఎన్నో ధర్మాలకి అక్షర రూపం ఈ నాటకం. ప్రతీ శ్లోకంలోనూ ఒక్కో ధర్మాన్ని చూడచ్చు. వాటిల్లో అన్నీ వ్రాయలేను కానీ కొన్ని ముఖ్యమయినవి, ఆలోచించ తగినవి (నా ఉద్దేశ్యంలో):

ప్రాణానామనిలేన వృత్తి రుచితా సత్కల్ప వృక్షేవనే
తోయే కాంచన పద్మరేణుకపిశే ధర్మాభిషేక క్రియా
ధ్యానం రత్న శిలాతలేషు విభుధస్త్రీ సన్నిధౌ సంమ్యమః
యత్కాంక్షంతి తపోభిరన్య మునయః తస్మిన్ తపస్యంత్యమీ

ఇది దుష్యంతుడు కశ్యప ప్రజాపతి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితిని వర్ణించిన సందర్భంలోనిది. అక్కడ ఉన్న జనాలు కల్పవృక్షం క్రింద కూర్చుని ప్రాణాయామం చేస్తున్నారు, ఆకాశగంగలో బంగారు తామరపూల మధ్యన స్నానం చేస్తున్నారు, రత్నాలతో చేసిన వేదిక పైన కూర్చుని తపస్సు చేస్తున్నారు, చుట్టూ అప్సరసలు తిరుగుతున్నా పట్టించుకోకుండా ధ్యానంలో నిమగ్నమై ఉన్నారు. అసలు సాధారణ మానవులు ఏవయితే కోరుకుంటారో వాటికి మించి ఉన్నా కూడా మోక్షం కోసం ఇవన్నీ చేస్తున్నారు. అంటే దీనిని బట్టీ కాళిదాసు ఈ భోగభాగ్యాలు శాశ్వతం కాదు ఆత్మసాక్షాత్కారం, మోక్షం మాత్రమే శాశ్వతం అని చెప్తున్నాడా (?) అనిపిస్తుంది. కానీ వారిలో వేటికీ చలించకుండా ఉన్న చిత్తశుద్ధి, చేస్తున్న పని మీద ఏకాగ్రత మనకు ఉంటే అబ్బో! ఎన్ని సాధించే వాళ్ళమో!   

తన వద్దకు వచ్చిన శకుంతలని నిరాకరించిన దుష్యంతునికి ఒక పాట వినిపిస్తుంది. దాని భావం "తుమ్మెదా! నువ్వు ఒక పువ్వు మీద వాలి మకరందాన్ని స్వీకరించావు, తరువాత దీనిని వదిలేసి ఇంకొక పువ్వు మీద వాలతావు" అని ఉంటుంది. అది వినేసరికి దుష్యంతుని
కి మనసులో అల్లకల్లోలం. మనసుకి బాగా పట్టేసినది ఏదయినా విన్నా, దాని గురించి ఏం తెలిసినా అదంతా గత జన్మ భావన అనుకోవటమే కాక మనసు చలించిపోయి ఉద్వేగానికి గురవుతారు. అందుకే భావస్థిరాణి జననాంతర సౌహృదాని అంటారు. ఇక్కడ దుష్యంతుని ఆ తుమ్మేదని నేనే ఎవరినో వదిలేసాను అన్న భావన గత జన్మలోదని భావించాడు కానీ ఈ జన్మలోదే అని శాప ప్రభావం చేత తెలుసుకోలేకపోయాడు. మనసుకి బాగా దగ్గరయినవి ఎన్నటికీ మర్చిపోలేము అన్న మాట మనందరికీ అనుభవమే కదా!

ఒక
పౌర్ణమి తరువాతి రోజు సూర్యోదయాన్ని వర్ణిస్తూ ఒకరు (చంద్రుడు) అంతమవుతుంటే ఒకరు (సూర్యుడు) పుడుతున్నాడు అంటారు కాళిదాసు. ఇది మనందరం చూసే విషయమే కదా ఇందులో వింతేముంది అనుకోకండి. ఆలోచిస్తే ఒక మనిషి చనిపోతుంటే వేరొక మనిషి పుడుతున్నాడు అన్న అంతరార్థం ఉంది కదా. అది చెప్పేందుకే ఇలా చూపించాడా అనిపిస్తుంది.

వాస్తవానికి రాజయిన దుష్యంతునికి మునికుమార్తె శకుంతల మీద ప్రేమ భావం కలుగకూడదు. కానీ కలుగుతోంది అంటే ఇది నిజంగా తప్పు కాదు అనుకుంటాడు (నిజానికి ఈమె విశ్వామిత్రుని కుమార్తె కదా).
సతాంహి సందేహ పదేషు వస్తుషు ప్రమాణ మంతః కరణ ప్రవృత్తయః అన్నట్టు సందేహంగా ఉన్నప్పుడు మనసు ఏది చెప్తే అదే చేయమని అంటాడు కాళిదాసు.
సత్పురుషులకీ, గొప్పవారికి మనస్సే ప్రమాణం. అందుకే కదా మనస్సాక్షికి మాత్రమే భయపడాలి అంటారు.

అత్తవారింటికి వెళ్తున్న శకుంతల తండ్రయిన కణ్వ మహర్షిని మళ్ళీ పుట్టింటికి ఎప్పుడు రాను? అని అడుగుతుంది పుట్టింటి మీద మమకారంతో. అది విన్న ఆయన వానప్రస్థానికి రమ్మంటాడు. దీనిని బట్టీ పెళ్ళయిన ఆడపిల్ల అస్తమానూ పుట్టింటికి రాకూడదు అన్న విషయం చెప్పకనే చెప్పినట్టు అనిపిస్తుంది.

ఇలా చెప్పుకుంటూ పోతే నాటకమంతా చాలా చాలా ఆలోచనలను రేపింది. కాళిదాసు రచనలన్నింటిలోనూ అభిజ్ఞాన శాకుంతలం ఎంతో కీర్తి సంపాదించుకుంది. వేరే భాషలలో కూడా ఎక్కువగా అమ్ముడయిన పుస్తకం ఇదే (ట). ఎన్నో భాషలలోకి తర్జుమా చేసినా సంస్కృతంలో మాత్రమే
చదవాలని కేవలం ఈ నాటకం ఆస్వాదించడం కోసమే కొంతమంది సంస్కృతం నేర్చుకున్నారు అంటే అతిశయోక్తి కాదు. నేనూ అలా నేర్చుకున్నదే :)
సేకరణ: రసజ్ఞ