మన అతి ప్రాచీన, ఆధ్యాత్మిక క్షేత్రం వేములవాడ. కోరిన వరాలిచ్చే మన ‘రాజన్న’ ఎందరో భక్తుల కొంగు బంగారమై, వారింటి ఇలవేల్పుగా అలరారుతున్నాడు!
రాజన్న ఆలయానికి ఎడమవైపున ఉన్న కాశీ విశ్వేశ్వరాలయంలోని లేత గులాబీ రంగు ‘శివ లింగం’ నిజంగా ఒక అద్భుతం. దీనిని ‘కాశీ విశ్వేశ్వర లింగం’గా పిలుస్తారు. దీనివల్లే వేములవాడకు ‘దక్షిణ కాశి’ అనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతారు.
చుట్టూ ఎత్తై గోడలతో ఉన్న ఈ దేవాలయం తూర్పు ముఖంగా ఉంది. ముఖ మంటపానికి తూర్పు, ఉత్తర, దక్షిణ దిశల్లో ద్వారాలున్నాయి. పడమర దిక్కు ఉన్న గర్భగృహంలో పానపట్టంపై రాజన్న లింగాకారంలో కొలువై ఉన్నాడు.
కరీంనగర్ : వేములవాడ మన తెలంగాణలోని అతి వూపాచీన ఆధ్యాత్మిక కేంద్రమే కాదు, చారివూతాత్మక పట్టణం కూడా. క్రీ.శ. 8వ శతాబ్ది నాటికే ‘సపాదలక్ష’ దేశానికి (నేటి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలు కలిసిన ప్రాంతం) ఇది రాజధానిగా ఉండింది. మొదట బోధన్ రాజధానిగా ఉన్న సపాదలక్షను ఏలిన ‘వేములవాడ చాళుక్యులు’ (రాష్ట్రకూటుల సామంతులు) తర్వాత వేములవాడనే రాజధానిగా చేసుకున్నారని చరిత్ర చెబుతోంది. వారు ఈ ప్రాంతాన్ని క్రీ.శ 750 నుంచి 973 దాకా (223 ఏళ్లు) అవిచ్ఛిన్నంగా పరిపాలించారని, మొత్తం 12 మంది రాజుల ఏలుబడిలో ఉండిన ఈ వేములవాడ ఒక ఘనమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా, ఎందరో గొప్ప కవులు, కళాకారులకు పుట్టినిల్లుగా భాసిల్లిందని మన చరివూతకారులు చెబుతారు.
నాటి ‘లేంబుళవాటిక’ నేటి వేములవాడ
కరీంనగర్ నుంచి సిరిసిల్లకు వెళ్లే దారిలో 35 కిలోమీటర్ల దూరంలో వేములవాడ ఉంది. ఇక్కడ లభ్యమైన సుమారు పది శాసనాలవల్ల వేములవాడ మొదట ‘లేంబుళవాటిక’గా ఉండి, తర్వాత ఏములవాడ, వేములవాడగా మారినట్లు తెలుస్తోంది.
‘వేములవాడ చాళుక్యుల’ కాలం కన్నడ భాషకు స్వర్ణయుగం వంటిది. కన్నడ ఆదికవి పంప రెండవ అరికేసరి నకీ.శ. 930-955)కి ఆస్థాన కవి. పంప తన ప్రభువును అర్జునుడితో పోలుస్తూ, రచించిన ‘విక్షికమార్జున విజయం’ కన్నడలో ‘పంప భారతం’గా ప్రసిద్ధి చెందింది. వ్యాసభారతాన్ని నన్నయ తెలుగులోకి అనువదించడానికి ముందే జరిగిన అనువాదంగా దీనిని చరివూతకారులు చెప్తారు.పంప తన 30వ ఏటే క్రీ.శ.941లో జైన మొదటి తీర్థంకరుడైన రిషబనాథుడిపై ‘ఆదిపురాణం’ రచించాడు. ఇతడి తమ్ముడు జినవల్లభుడు కరీంనగర్ జిల్లా కురిక్యాల బొమ్మల గుట్టపై వేసిన శాసనంలో తొలి తెలుగు కంద పద్యాలున్నాయి.
దేవాలయాలకు పుట్టినిల్లు..
వేములవాడలో రాజరాజేశ్వరస్వామితో సహా భీమేశ్వరుడు, నగరేశ్వరుడు, బద్దిపోచమ్మలు ఘనంగా కొలువై ఉన్నారు. ఒకప్పుడీ పట్టణంలో లెక్కకు మించి దేవాలయాలుండేవని శాసనాల ద్వారా తెలుస్తోంది. కానీ, ప్రస్తుతం వాటిలో కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయి. చాలా దేవాలయాలు కాలగర్భంలో కలిసి పోయాయి. ఇప్పుడు వేములవాడలో రాజరాజేశ్వరాలయం, భీమేశ్వరాలయం, నగరేశ్వరాలయం, కేదారేశ్వరాలయాలతోపాటు ‘బద్దిపోచమ్మ’ గుడి విశేషంగా భక్తుల ఆదరణను పొందుతూ చారివూతక, ఆధ్యాత్మిక ప్రాశస్త్యాన్ని చాటుతున్నాయి.
రాజన్న గుడిని కళ్యాణి చాళుక్య సామంతుడైన రాజాదిత్యుడు తన పేరుతోనే క్రీ.శ.1083లో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ మేరకు అతడు వేయించిన శాసనం నేటికీ దేవాలయ ప్రాంగణం వాయువ్య మూలన ఉంది. వేములవాడ పట్టణం చెరువుకట్టపై ఆనాడు నిర్మించిన ‘రాజదిత్యేశ్వరాలయమే’ కాలక్షికమేణా ‘రాజరాజేశ్వర ఆలయం’గా మారింది. రాజరాజేశ్వరాలయం వెనుక ‘అనంత పద్మనాభస్వామి ఆలయం’ ఉంది. శివకేశవుల ఉత్సవాలు వేములవాడలో నిర్వహిస్తూ ఉండడం వల్ల దీనికి ‘హరిహర క్షేత్రమనే’ మరో పేరు కూడా బలపడింది.
చుట్టూ ఎత్తై గోడలతో ఉన్న ఈ దేవాలయం తూర్పు ముఖంగా ఉంది. ముఖ మంటపానికి తూర్పు, ఉత్తర, దక్షిణ దిశల్లో ద్వారాలున్నాయి. పడమర దిక్కు ఉన్న గర్భగృహంలో పానపట్టంపై రాజన్న లింగాకారంలో కొలువై ఉన్నాడు. ముఖ మంటపంలో కుడివైపున లక్ష్మీగణపతి విగ్రహం, ఎడమవైపు రాజరాజేశ్వరీదేవి (పార్వతి) ఉన్నారు. అమ్మవారి చేతిలో డమరుకం, త్రిశూలం, ఖడ్గం ఉన్నాయి. రాజేశ్వరాలయానికి ఎడమవైపు కాశీ విశ్వేశ్వరాలయం ఉంది. ఇందులో లేత గులాబీ రంగులో ‘శివ లింగం’ ఒక అద్భుతం. దీనిని ‘కాశీ విశ్వేశ్వర లింగం’గా పిలుస్తారు. దీనివల్లే వేములవాడకు ‘దక్షిణ కాశి’ అనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతారు.
రాజన్న సన్నిధిలోనే ‘కోదండ రాముడు’
వేములవాడ అటు శివరాత్రి వేడుకలకేకాదు, ఇటు సీతారామ కళ్యాణానికీ ప్రసిద్ధిగాంచింది. రాజరాజేశ్వర ఆలయ ప్రాంగణంలోనే ‘కోదండ రామాలయం’ ఉంది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి పర్వదినాన ఇక్కడ ‘సీతారాముల కల్యాణం’ అంగరంగ వైభవంగా జరుగుతుంది.
శివసత్తులు...
అయితే, ఆ రోజున దేశం నలుమూలల నుంచి హిజ్రాలు, తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు వేములవాడకు చేరుకుంటారు. వీరిలో కొందరు తమ ఇష్ట దైవం శివుడిని ఈ సందర్భంగా పెళ్లాడుతారు. ఈ తంతును స్థానికంగా ‘ధారణ’గా వ్యవహరిస్తారు. ఒకప్పటి జోగినీ దురాచారానికి ఇది కొనసాగింపుగా చెప్పుకోవచ్చు. కానీ, ఇక్కడ ధారణ చేసుకున్న మహిళలు, తాము శివైక్యం అయినట్లు భావించి, జీవితాంతం దైవసేవలోనే గడుపుతారు. భుజాన జోలె వేసుకుని, చేతిలో త్రిశూలం పట్టుకుని ప్రతి సోమవారం ఇంటింటికీ తిరుగుతూ బియ్యం సేకరించి, వండుకుని తింటారు.
ధర్మగుండం ప్రధాన ఆకర్షణ
రాజరాజేశ్వర దేవాలయాన్ని ఆనుకుని ఉత్తర దిశలో ధర్మగుండం ఉంది. ఇందులో సాన్నం చేస్తే, గ్రహబాధలు, చర్మవ్యాధులు పోతాయని, పాప విముక్తులవుతారని భక్తుల ప్రగాఢ నమ్మకం. మధ్యలో శివలింగాలున్న రెండు మండపాలు ధర్మగుండానికి ప్రధాన ఆకర్షణ.
భీమన్న గుడి శిల్పకళ అద్భుతం!
భీమేశ్వరాలయాన్ని వేములవాడ బద్దెగుడు నకీ.శ. 850-895) నిర్మించాడు. మొదట్లో ఇది బద్దెగేశ్వరాలయంగా ఉండి, తర్వాత భీమేశ్వరాలయంగా మారినట్లు చరివూతకారులు చెప్తారు. ఈ పట్టణంలోని అతి పురాతన దేవాలయం ఇదే. ఇక్కడి శిల్పకళ అద్భుతం. వేములవాడకు వచ్చిన ప్రతి ఒక్కరూ భీమేశ్వరుడిని దర్శించకుండా వెళ్ళరు.
ఇక్కడి నగరేశ్వరాలయాన్ని రెండో అరికేసరి కాలం నకీ.శ. 930-955)లోని ‘నకరము’ అనే వర్తక సమాజం నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. బద్దిపోచమ్మ ఆలయం బద్దెన నకీ.శ.850- 895) కాలంలో నిర్మితమైంది. పశ్చిమాభిముఖంగా ఉన్న ఈ గర్భగుడిలో పోచమ్మ విగ్రహమేకాక ఆలయావరణలో ‘జైన దిగంబర విగ్రహమూ’ ఉండటంతో వేములవాడ క్షేత్రం అప్పట్లో జైన మతస్థులకూ చెంది ఉంటుందని భావిస్తున్నారు. మరోపక్క రాజన్న దర్శనానికి వచ్చిన భక్తులలో చాలామంది విధిగా, బోనం వండి, బద్దిపోచమ్మకు సమర్పించుకుంటారు.
ఇక, కేదారేశ్వరాలయంలో క్రీ.శ.1033 నాటి శిలా శాసనమొకటి నేటికీ ఉంది. ఇక్కడి భోలాశంకరుడే నేడు కేదారేశ్వరుడుగా భక్తుల పూజలందుకొంటున్నాడు.
‘వద్దంటె ఎములాడ పోతాను అంటవె.. పొల్లగాని గుండుగాడ గీకిత్త నంటవె.. రాంగపోంగ ఎక్కదిగ ముల్లెమూట పైలమె..’ అని మనసుదీరా జానపదులు పాడుకునే గీతమొక్కటి చాలు, భక్తుల గుండెల్లో కొలువై వున్న రాజన్నపట్ల వారికి గల ప్రగాఢ విశ్వాసాన్ని చాటడానికి!
సంకలో పిల్ల, నెత్తి మీద ముల్లెతో అతడు. చేతిలో శూలం, భుజానికి జోలెతో ఆమె. ఆ వెనుక ఒకరో, ఇద్దరో చిన్న పిల్లలు. యువతీ యువకులు కూడా కావచ్చు. వారిని అనుసరిస్తూనో.. వారిస్తూనో ఇద్దరు వృద్ధులు. ఇలాంటివే రోజుకు, నెలకు, ఏటేటా వందల వేల కుటుంబాలు. అలా వేములవాడ వంతెన మీదుగా గుడికేసి సాగిపోతూ కనిపిస్తరు. అదో అపురూప దృశ్యం.. మానేరు మూల వాగుమీద నిర్మితమైన ఈ వంతెన దాటి పట్టణ ప్రధానవీథిలోకి అడుగుపెట్టగానే అగుపించే ఈ రకమైన భక్తజన సందోహానికి అక్కడ ఏ రోజూ కొదువుండదు. ఒక అంచనా ప్రకారం రోజుకు పదిహేను వేలమంది భక్తులు ‘రాజన్న’ను సందర్శిస్తున్నారు. ప్రతీ సోమవారం అయితే ఈ సంఖ్య అంతకు నాలుగు రెట్లు పెరుగుతుంది. అందులో శ్రావణమాసంలో రాజన్న సన్నిధికి వచ్చి వెళ్లే భక్తుల సంఖ్య లక్షల్లోనే ఉంటోంది.
అటు రాజన్న...ఇటు హజ్రత్ సయ్యద్ ఖ్యాజా !
వేములవాడలో అత్యంత విశేషమేమంటే ఇక్కడి రాజన్న సన్నిధిలోనే ముస్లిం సోదరుల ఆరాధ్య సమాధి కూడా ఒకటి ఉంది. ఒకవైపు రాజన్నను కొలవడానికి, మరోవైపు ‘హవూజత్ సయ్యద్ ఖ్వాజా’ సమాధిని దర్శించుకోవడానికి వచ్చేపోయే హిందూ ముస్లింలతో వేములవాడ అనునిత్యం మత సామరస్య శోభకు ఒక మన్నికైన మచ్చుతునకగా విరాజిల్లుతోంది.
కోడెమొక్కులు...
దేశంలో ఎక్కడా లేని విధంగా వేములవాడలో కోడె (కోడెలాగె=కోల్లాగె) మొక్కుల సంప్రదాయం ఉంది. శివుడి వాహనం నంది. కనుక, భక్తులు ఆ ‘నంది’ స్వామికి సమర్పించుకోవడంలో భాగంగానే ఈ ఆచారం పుట్టినట్లు చెప్తారు. అందుకే కష్టనష్టాల్లోంచి బయటపడితే, కోర్కెలు తీరితే, ముందుగా మొక్కుకున్నట్లు భక్తులు రాజరాజేశ్వరుడికి కోడెలను సమర్పించుకుంటారు. ఇప్పటికీ తెలంగాణలోని వివిధ జిల్లాలనుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఇళ్ల నుంచి కోల్లాగెలను తెచ్చి, రాజన్న సన్నిధిలో కట్టేసి వెళతారు. వేలాదిగా వచ్చే కోడెలను దేవస్థానం నెలనెలా వేలం వేస్తుంది. సుమారు 100కు పైగా కోడెలను దేవస్థానమే పెంచి పోషిస్తున్నది. ఇందుకోసం దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక గోశాల ఉంది. ఇంటివద్ద నుంచి కోడెలు తెచ్చుకోలేని వారి కోసం కోడెలను సరఫరా చేస్తారు.
‘‘ఏటా ఒక్కసారైన ఎములాడ పోవాలె. ఇంటిల్లి పాది తల ఇచ్చి, ధర్మగుండంలో స్నానం చెయ్యాలె. రాజన్నను తనివి తీరా చూసుకోవాలె. కోల్లాగెను కట్టేసి పిల్లజెల్ల, పాడిపంట సల్లంగ ఉండాపూనని మొక్కుకోవాలె’’ అని కోరుకునే భక్తులు ఎందరో!
సేకరణ: నమస్తే తెలంగాణా దినపత్రిక.

No comments:
Post a Comment