Saturday, 16 February 2013

రథసప్తమి: ఆదివారం రావడం విశేషం


ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే

సప్తాశ్వ రథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం
శ్వేత పద్మ ధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

లోహితం రథమారూఢం సర్వ లోక పితామహం
మహాపాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం 

త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

బృంహితం తేజసాం పుంజం వాయు రాకాశ మేవచ
ప్రభుస్త్వం సర్వ లోకానాం తం సూర్యం ప్రణమామ్యహం

బంధూక పుష్ప సంకాశం హర కుండల భూషితం
ఏక చక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

విశ్వేశం విశ్వ కర్తారం మహా తేజః ప్రదీపనం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

శ్రీ విష్ణుం జగతాం నాథం జ్ఞాన విజ్ఞాన మోక్షదం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడా ప్రణాశనం
అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్

ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే
సప్త జన్మ భవేద్రోగీ జన్మ జన్మ దరిద్రతా

స్త్రీ తైల మధు మాంసాని ఏత్యజంతి రవేర్దినే
న వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం స గచ్ఛతి


ఇతి శ్రీ శివప్రోక్తం శ్రీ సూర్యాష్టకం సంపూర్ణం

  రథసప్తమి ఈ నెల 17వ తేదీన వస్తోంది. ఇందులో విశేషమేమిటంటే.. రథసప్తమి ఆదివారం రావడం. సూర్యునికి 

ఇష్టమైన ఆదివారం నాడు రథసప్తమి వస్తే చాలా మంచిదని, ఈ పర్వదినమున సూర్య భగవానుడిని నిష్ఠతో 

పూజిస్తే అనుకున్న కార్యాలు నెరవేరుతాయని పండితులు అంటున్నారు. 

ఇంకా రథసప్తమి రోజున సూర్యభగవానుడిని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోయి పుణ్యఫలం సిద్ధిస్తుందని 

పురాణాలు చెబుతున్నాయి. ఆదిత్యుని జన్మదినమైన రథసప్తమిరోజున సూర్యోదయానికి ముందే లేచి.. 

పూజామందిరాన్ని శుభ్రపరుచుకుని... పసుపు, కుంకుమ, పువ్వులు, ముగ్గులతో అలంకరించుకోవాలి. 

మగవారైతే స్నానం చేసే నీటిలో జిల్లేడు ఆకులను వేసుకుని ఆ నీటితో స్నానం చేయాలి. అదే 

మహిళలైతే..చిక్కుడు ఆకులతో స్నానం చేయడం మంచిది.


 తర్వాత ఎర్రటి పట్టుబట్టలు ధరించి, ఆదిత్యునిని నిష్ఠతో స్తుతించాలి. రథసప్తమి రోజున సూర్యభగవానుడికి 

కనకంబరాలు, ఎర్రచామంతి పువ్వులను సమర్పించే 

వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం. పూజకు అనంతరం ఆదిత్యునికి ఎర్రటి పండ్లు, చిక్కుడు 

కాయలతో చేసిన పొంగలి, బూరెలను నైవేద్యంగా సమర్పించుకోవచ్చు.

ఇదే రోజున సూర్య అష్టోత్తరము, సూర్యాష్టకమ్‌‌ను పఠించడం మంచిది. ఆదిత్యారాధన పారాయణ చేసి 

సూర్యభగవానుడిని దర్శనం చేసుకోవాలి. ఇందులో ముఖ్యంగా అరసవల్లి, గొల్లలమామిడాడ, పెద్దాపురం వంటి 

ప్రాంతాల్లో వెలసిన సూర్యదేవాలయాన్ని సందర్శించుకోవడం ద్వారా కోటి జన్మల పుణ్యఫలాన్ని పొందవచ్చునని 

పురాణాలు చెబుతున్నాయి

అలాగే రథసప్తమి నాడు ఆలయాల్లో సూర్యధ్యానము, సూర్య అష్టోత్తర నామార్చన, సూర్య నమస్కారములు, 

సూర్య నారాయణ నిత్యపూజ, ఆదిత్యరాధన వంటి పూజలు చేయిస్తే శుభఫలితాలు ఉంటాయని పండితులు 

అంటున్నారు.

No comments:

Post a Comment