Tuesday, 18 February 2014

శ్రీ గాయత్రీ


 

మంత్రాక్షరాల మహాతత్వాలు   

పరమ పవిత్రముమహా మహిమాన్వితము అయిన గాయత్రీ మంత్రంలోని 24 బీజాక్షరాలు, 24దైవీతత్వాలకు సంబంధించి ఉన్నవిఒక్కొక్క అక్షరం ఒక్కొక్క దేవత యొక్క చైతన్యశక్తి కలిగిఉన్నవి.

1. తత్ - గణపతి - విఘ్ననివారణకార్య సఫలతబుద్ధి ప్రదానం.
2.  - నార శింహుడు - పరాక్రమశక్తివీరత్వంధీరత్వంపురుషార్ధంవిజయసిద్ధి.
3. వి - విష్ణువు - స్థితికారకుడు కనుక పాలనాశక్తి కలిగిసర్వజివులను సంరక్షించిజీవికను
    ప్రసాదించును.
4. తుః - శివుడు - కళ్యాణకారకుడుఆత్మపరాయణతనిచ్చిపతనం కాకుండా కాపాడును.
5.  - కృష్ణుడు - యోగశక్తిఆత్మనిష్టవైరాగ్యంజ్ఞానంసౌందర్యంసరసత్వాదులు ప్రసాదించును.
6. రే - రాధ - ప్రేమశక్తికి అధిష్టాత్రి కనుక ప్రేమను పెంచి అసూయాద్వేషాదులు పోగొట్టును.
7. ణ్యం - లక్ష్మి - ఐశ్వర్యశక్తిధన ధాన్య వైభవ సుఖసంపదలిచ్చును.
8.  - అగ్ని - తేజోశక్తిశక్తి సామర్ధ్యాలు ప్రసాదించును.
9.  ర్గః - ఇంద్రుడు - రక్షాశక్తిరోగచోరశతృభూత ప్రేత పీడల నుండి రక్షించును.
10 దే - సరస్వతి - జ్ఞానశక్తికి అధిష్టాత్రియైజ్ఞానంవివేకందూరదర్శతబుద్ధి వికసత ప్రదానం
     చేయును.
11.  - దుర్గ - దమన శక్తియుతమైదుష్టులనుశత్రువులను నాశనం చేసిభక్తులను రక్షించి
       సమస్త విధాలైన శక్తి సామర్ధ్యాలను ప్రసాదించును.
12. స్య - హనుమంతుడు - నిష్టాశక్తికి ఆధారంనిర్భయత్వంకర్తవ్య పరాయణతవిశ్వాసం,
       బ్రహ్మచర్య పాలన శక్తి ప్రసాదించును.
13. ధీ - పృధ్వి - ధారణ శక్తికి దేవతధైర్యంగంభీరత్వంక్షమాగుణంనిరంతత్వం ప్రసాదించును.
14.  - సూర్యుడు - ప్రాణశక్తికి ఆధారంఆయురారోగ్య ప్రదాత.
15. హి - శ్రీరాముడు - మర్యాదాశక్తి కలిగిధర్మంశీలంక్షమసంయమనంమైత్రి,
      ప్రేమలనిచ్చును.
16. ధి - సీత - తపశక్తికి అధిదేవతైసాత్వికత్వంనిర్వికారత్వంఅధ్యాత్మికోన్నతికి మార్గం
       చూపించును.
17. యో - చంద్రుడు -  శాంతి శక్తి కలిగిదుఃఖంకోపంపగతృష్ణ మొదలైన వికారాలను అణచి,
      సర్వస్య శాంతినిచ్చును.
18. యోః - యముడు కాలశక్తికి అధిష్టాతస్ఫూర్తిజాగరూకతసమయ సదుపయోగంప్రదానం
      చేసి మృత్యుభయాన్ని నివారించును.
19. నః - బ్రహ్మ - సృష్ణి శక్తికి ఆధారమైన బ్రహ్మ జడ చేతవాదులను సృష్ణించి వర్ధిల్ల చేయును.
20. ప్ర - వరుణుడు - రసశక్తి కలిగిన వరుణుడుభావుకతకోమలతదయమధురత్వంసరసత,
      కళాప్రియత్వం కలిగించును.
21. చో - నారాయణుడు - ఆదర్శ శక్తికి మూలంశ్రేష్టత్వంఆకాంక్షదివ్య గుణమయుత,
      ధర్మస్వాభావం ప్రదానం చేయును.
22.  -  హయగ్రీవ - సాహస శక్తికి మూలంఉత్సాహంనిర్భయత్వంసాహసంశౌర్యధైర్యాలను
     ప్రేరేపించును.
23. యూ - హంస - వివేక శక్తియుక్తమైన హంసభవిష్యజ్ఞానంసత్సాంగత్యందూరదర్శిత్వం,
     ఉజ్వల యశస్సుఉత్కృష్టాహారంసంతోషాలనిచ్చును.
24. త్ - తులసి -సేవాశక్తికి అధిష్ట్తాత్రిసేవాబుద్ధినిఆత్మశాంతిని ఇచ్చి సత్కర్మాచరణకై     
     ప్రేరేపించును.

 24 తత్వాలకు ప్రత్యేక గాయత్రీ మంత్రాలున్నాయి.
వీరు కాక మంత్రంలోని 24  బీజాక్షరాలను ఆవహించిన కామ్య ఫలప్రదాత్రులైన 24 గురు అధిష్టాన దేవతలు వీరే.

1.  - వామదేవి
2. త్ - ప్రియా
3. స  - సత్యా
4. వి - విశ్వా
5. తు  భద్రా
6. ర్వ విభావతి
7. రే జయా
8. ణ్యం శాంతా
9. భ కాంతా
10. ర్గో దుర్గా
11. దే సరస్వతి
12. వ విద్రుమ
13. స్య విశాలా
14. ధీ వ్యాపినీ
15. మ విమలా
16. హి తమోపహారిణి
17. ధి సూక్ష్మా
18. యోః విశ్వయోని
19. యో జయా
20, న వశా
21. ప్ర పద్మాలయా
22. చో పరాశోభా
23.   - భద్రిణి
24. యాత్ - త్రిపదా

అతి శక్తివంతమైన శ్రీ గాయత్రీ మహమంత్రంలోని బీజాక్షరాల మహిమ అపారంఅనన్యం,సర్వసిద్ధిప్రదం.

1.  - అజ్ఞానాన్ని పోగొట్టునది
2. త్స - ఉపపాతకములను నివారించునది
3. వి - మహాపాతములను నివారించునది
4. తు - దుష్టగ్రహ దోషాలను నివారించునది.
5. ర్వ - భ్రూణహత్యా దోషాలను నివృత్తి చేయునది
6. రే - తెలియక చేసిన పాపాలను పోగొట్టునది
7. ణి - తినకూడని వాటిని తిన్న దోషాన్ని పరిహరించునది.
8. యం - బ్రహ్మహత్యా పాతకాన్ని నశింపచేయునది
9.  - పురుష హత్యా పాతకాన్ని పోగొట్టునది.
10. ర్గో - గోహత్యా దోషాన్ని నివృత్తి చేయునది.
11.  దే - స్త్రీహత్యా పాతకాన్ని పోగొట్టునది
12.  - గురు హత్యాపాపాన్ని నివారించును.
13,. స్య - మానసిక దోషాలను నివారించును
14. ధీ - మాతృపితృ వధా పాతకాన్ని పరిహరించును.
15.  - పూర్వ జన్మార్జిత పాపాల నుండి రక్షించును
16. హి - అనేక పాప సమూహాలను నశింపచేయును
17. ధి - ప్రాణి వధ చేసిన పాపం నుండి కాపాడును
18. యోః - సర్వపాపాలను నివృత్తి చేయును.
19. యో - సర్వపాపాలను నివృత్తి చేయును
20. నః - ఈశ్వరప్రాప్తి నిచ్చును
21. ప్ర - విష్ణులోక ప్రాప్తి
22. చో - రుద్రలోక ప్రాప్తి
23.  - బ్రహ్మలోక ప్రాప్తి
24. యాత్ - పరబ్రహ్మైక్య సిద్ధి ప్రసాదించును.

గాయత్రీ కవచంలో ఉన్న రూపాలు తానే అయిన దేవి ఇలా వర్ణించబడింది.
గాయత్రి - తూర్పు దిక్కును
సావిత్రి - దక్షిణ దిక్కును
సంధ్యాదేవి - పడమర దిక్కును
సరస్వతి - ఉత్తర దిక్కును
పార్వతి - ఆగ్నేయాన్ని
జలశాయని - నైరుతిని
పవమాన విలాసిని - వాయువ్య దిక్కును
రుద్రాణి - ఈశాన్య దిక్కును రక్షీంచుగాక
తుత్ - పాదాలను
సవితుః - జంఘలను
వరేణ్యం - కటిని
భర్గః - నాభిని
దేవస్య - హృదయాన్ని
ధీమహి - చెక్కిళ్ళను
ధియః - నేత్రాలను
యః - లలాటంను
నః - శిరస్సును
ప్రచోదయాత్ - శిఖా భాగాన్ని రక్షించుగాక.
ఇంకా వివరంగా చెప్పాలంటే మన శరీరంలోని ప్రతిభాగమ్ శ్రీ గాయత్రీ మాత రక్షణ కవచంలో భద్రంగా ఉంటాయి.

తత్ - శిరస్సు
సకారం - ఫాలం
వి - నేత్రాలు
తు - కపోలాలు
 - నాసాపుటాలు
రే - ముఖం
ణి - పైపెదవి
యం - కింది పెదవి
 - మద్య భాగం
ర్గో - చుబుకం
దే - కంఠం
 - భుజాలు
స్య - కుడి చేయి
ధీ - ఎడమ చేయి
 - హృదయం
హి - ఉదరం
ధి - నాభి
యో - కటి
యో - మర్మప్రదేశం
నః - తొడలు
ప్ర - జానువులు
చో - జంఘం
 - గుల్ఫం
యా - పాదాలు
త్ - సర్వ అంగాలు

ఈ విధంగా మన దేహంలోని సర్వ అంగాలను పరిరక్షించమని ఆ తల్లిని వేడుకుందాం.

అందుకే అనంతమైనఅంతరిక్షంలో వెలిగే జ్యోతిర్గోళలకువెలుగునిచ్చు పరంజ్యోతి గాయత్రీ మాత శక్తి అపారంఅత్యద్భుతం.
courtesy:- సిలికానాంధ్ర

Tuesday, 20 August 2013

శ్రీకృష్ణ రక్షా మంత్ర శ్లోకము



చిన్నపిల్లలకి దృష్టి దోషాలు తగులకుండా శ్రీకృష్ణ రక్షా మంత్ర శ్లోకము:

వాసుదేవో జగన్నాథో పూతనాతర్జనో హరిః I రక్షతు త్వరితో బాలం ముంచ ముంచ కుమారకం II కృష్ణ రక్ష శిశుం శంఖ మధుకైటభమర్దన I ప్రాతస్సంగవ మధ్యాహ్న సాయాహ్నేషు చ సంధ్యయోః II
మహానిశి సదారక్ష కంసారిష్ట నిషూదన I యద్గోరజః పిశాచాంశ్చ గ్రహాన్ మాతృగ్రహానపి II బాలగ్రహాన్ విశేషేణ ఛింది ఛింది మహాభయాన్ I త్రాహి త్రాహి హరే నిత్యం త్వద్రక్షాభూషితం శుభం II

సామవేదం షణ్ముఖశర్మ గారి ఋషిపీఠం నుంచి
సాధారణంగా మంత్రమెప్పుడూ గోప్యమే! కాని ఇటువంటి మంత్రాలు ఎవరయినా పఠించచ్చు, అందుకు వీటిని ప్రముఖంగా చెప్పినా తప్పులేదు. అవసరాన్ని బట్టి ఉపయోగించుకోండి.
దీన్ని పఠించే ముందు కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుగుకోండి, తిలకం ధరించండి! దిష్టి తీయ్యాలనుకున్న పాపను చేతులోకి తీసుకోండి.విభూదిగాని, చందనంగాని చేతులో తీసుకోండి, మూడు సార్లు దీనిని పఠించండి, ఆ తర్వాత బిడ్డ ముఖాన, హృదయం, వీపు, చేతులు,ఇలా సర్వాంగాలమీద రాయండి.

Wednesday, 22 May 2013

అంగారక చతుర్థి కధ

ఓం గం గణపతయే నమః

అంగారక చతుర్థి కధ-
సప్త మోక్ష పురాలలో ఒకటైన అవంతికాపురి(ఉజ్జయిని,మధ్యప్రదేశ్ లో ఉంది)లో నిత్యం అగ్నిహోత్రాన్ని నిర్వహించేవాడు,సమస్త శాస్త్రకోవిదుడు,వేద స్వరూపుడైన భరద్వాజముని నివసిస్తుండేవారు.గంగా తీరానికి వెళ్ళి 3 సంధ్యలలోనూ సంధ్యావందాం,అనుష్ఠానం మొదలైనవి నిర్వర్తించేవాడు.

ఒకనాడు భరద్వాజ మహర్షి ఉషోదయాన అనుష్ఠానం నిర్వర్తించుకుని తిరిగి వస్తుండగా,గంగా తీరంలో విహారానికి వచ్చిన దేవలోకపు అప్సరస ఆతన దృష్టిలో పడింది.ఆమె సౌందర్యం ఎంత మోహపరవశాన్ని కలిగించిందంటే మహతప్పశాలి,అపర శివావతారుడు అని పిలువబడే ఆ మహర్షిని విచలితుణ్ణి చేసింది.

ఆ అప్సరస కారణంగా భరద్వాజుడికి రేతస్సు(వీర్యము)పతనమై భూమిపైన పడింది.(స్వేదం(చెమట)పడిందని అని కొందరు అంటారు.ఏది ఏమైనా కధ తెలుసుకోవడంలో ఇది అడ్డంకి కాకుడదు.)ఒక కారణజన్ముడు జన్మించాలి కనుక,భూమాత దానిని స్వీకరించింది.తద్వారా ఒక ఆజానుబాహుడు,ఎర్రని దేహకాంతి కలవాడు,విశాలమైన నేత్రాలు గల బాలకుడు ఉదయించాడు.

తన జన్మకు మహర్షి కారణమని తెలియని ఆ బాలుడూ నిరంతరం తల్లిని తన తండ్రి ఎవరని వేధించేవాడు.తగిన సమయం వచ్చినప్పుడు,తెలియజేయాలని అనుకున్న భూదేవి మౌనంగా ఆ బాబుని పెంచసాగింది.

7 సంవత్సరముల వయసులో ఆ బాలకుడిని తీసుకుని,భరద్వాజ మహర్షి వద్దకు వెళ్ళిన భూదేవి "మహర్షీ!నీ కారణంగా ఈ బాలుడూ జన్మించినందున,ఇతడిన పుత్రుడుగా పరిగ్రహించు.చౌలము,ఉపనయనము మొదలైన సంస్కారాలు జరిపించి,అమోఘ విద్యాప్రాప్తి కలిగించు" అని ఆ కూమారుని అప్పగించింది.

సాక్షాత్ భూదేవి తనకు అప్పగించిన పుత్రుని వాత్సల్యంతో దగ్గరకు తీసుకున్నాడు భరద్వాజుడు.ఉపనయనాది సంస్కారాలు యధావిధిగా జరిపించి,గణపతి మహామంత్రమును ఉపదేశించాడు."నాయనా! ఈ గణేశ మంత్రాన్ని స్వామి ప్రీతికొరకు జపించి ఆయన అనుగ్రహం పొంది,నీ జన్మ ధన్యం చేసుకో!" అని చెప్పాడు.

తండ్రి ఆజ్ఞ ప్రకారం ఆ బాలుడు నర్మదా నది తీరాన కఠొర తపస్సు చేశాడు.ఒకానొక మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్థీ(చవితి) దినానా చంద్రోదయ వేళలో "ఎవరి ఆజ్ఞ చేత బ్రహ్మ సృష్టి చేస్తాడో,ఎవరి ఆజ్ఞతో విష్ణువు స్థితికారకుడిగా రక్షిస్తాడో,ఎవరి ఆజ్ఞతోనే పరమశివుడు లయం చేస్తాడో,ఎవరి అనుగ్రహం వలన యోగులు,సిద్ధులు సిద్ధిని పొందారో,ఎవరు నిత్యం మూలాధారంలో స్థిరంగా ఉంటాడో,అట్టి పరబ్రహ్మ అయిన మాహా గణపతి" ఆ బాలునకు దర్శనమిచ్చాడు.సర్వాభరణ భూషితుడైన గజానన మహారాజును ఆ బాలుడూ స్తూతించాక,గణపతి ప్రసన్నుడై "కుమారా!.........కోఠరమైన నీ తపోదీక్షకు మెచ్చి నీకు వరం ఈయాదలచాను.ఏ వరం కావాలో కోరుకో" అన్నాడు.

"గణనాధా! నీ దర్శనమాత్రాన నా జన్మ చరితార్ధమైంది.నాకు కోరికలు ప్రత్యేకంగా ఏమీ లేవు.నేనూ దేవతాగణలాలో ఒకడిగా ఉండేలా అనుగ్రహించు.చాలు!"అన్నాడు ఆ బాలుడు.

"నీవు నిరపేక్షతో నన్ను ప్రసనున్నుణ్ణి చేసుకునందుకు నీకు వారాలలో ఒక రోజుకు ఆధిపత్యం ఇస్తున్నా.నీకు గ్రహాలలో స్థానం కల్పిస్తాను.నేటి నుంచి నీవు "మంగళుడు" అనే పేరుతో ప్రసిద్ధుడవవుతావు.అనగా ప్రజలకు "మంగళాలను"(శుభాలను) కలిగించే వాడవు.నీకు ఆధిపత్యం ఇచ్చిన రోజున నా "చవితి తిధి" ఏర్పడితే,ఇంకా ఎక్కువ పుణ్యఫలదాయకం అయ్యేలా అనుగర్హిస్తున్నాను.భూదేవి పుత్రునిగా నీవు "కుజుడు"అనే పేరుతో వ్యవహరించబడతావు" అని అనుగ్రహించాడు గణపతి.

అనంతరం దశభుజ గణపతిని,కుజుడు కామదాతృక్షేత్రంలో ప్రతిష్టించి తన పేరిట అంగారక చవితి వ్రతాన్ని చేసినవారికి సర్వసౌఖ్యాలు ఓనగూడెలా దీవించమని విఘ్నరాజును ప్రార్ధించాడు.చింతితమైన(కోరిన) అభీష్టాలను(కోరికలను)మణివలె ప్రసాదించేవాడైన ఈ గణపతిని చింతామణి గణపతి అంటారు.నేటికి కామాదాతృ క్షేత్రంలో చంద్రోదయ సమయంలో సిద్ధులు,యోగులు,గంధర్వులు గణపతిని సేవిస్తుంటారు.

జనవరి 1 2013,మంగళవారం,అంగారక చతుర్థీ,వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు.సంకటహర గణపతిని పూజించండి.గణపతి ఆలయాలను సందర్శించండి.జీవితంలో సంకటాలను గణపతి అనుగ్రహంతో తొలగించుకోండి. 

మహా గణపతి అనుగ్రహప్రాప్తిరస్తు
సర్వే భవంతు సుఖినః
సర్వే సంతు నిరామయః
సర్వే భధ్రాణి పశ్యంతుః
సర్వే జనః సుఖినోభవంతుః
సమస్త సన్మంగళాని భవంతుః
ఓం శాంతిః శాంతిః శాంతిః                       


అంగారక చతుర్థి - మే 28 2013 ,మంగళవారము.


Saturday, 9 March 2013

మహా శివరాత్రి

                                                                                                                                         
విశిష్టత
























































































































మాఘ మాసం అమావాస్య ముందు రాత్రి శివరాత్రి జరుపుకుంటారు. అమావాస్య కలియుగానికి ప్రతీక. కలియుగం అజ్ఞాన అంధకారాలకు నెలవు. అజ్ఞాన అంధకారాలను ప్రాలదోలుతూ మహేశ్వరుని ఆవిర్భావమే మహా శివరాత్రి.
శివరాత్రి దినాన శివుని లింగ రూపంలో - "లింగోద్భవ మూర్తి" లేక "జ్యోతిర్లింగరూపం" లో పూజిస్తారు. లింగం తేజో రూపం. దీనికి ఆది,అంతం లేదు. నిర్గుణుడూ, అరూపుడూ అయిన తేజోమూర్తి రూపమే లింగం.
శివరాత్రి తో సంబంధించిన ఎన్నో కధలు ఉన్నాయి. శివోభావం, లింగోద్భవం, శివతాండవ ఆద్యం, కాలకూట సేవనం, బిల్వ పత్రాల యొక్క గొప్పతనాన్ని చెప్పే వేటగాని కధ తదితరులు.
మహాభారతం శాంతిపర్వంలో భీష్ముడు అంపశయ్య మీద ఉండగా చేసిన ధర్మప్రసంగాలలో చిత్రభానుమహారాజు చేసిన మహాశివరాత్రి దీక్ష గురించి వివరించాడు. కధ – "ఒకానొక కాలంలో జంబూద్వీపం సమస్తమునూ ఇక్ష్వాకు మహారాజు చిత్రభానుడు పరిపాలించేవాడు. ఒక మహాశివరాత్రినాడు అతడు, అతడి భార్య కలిసి ఉపవాసము ఆచరిన్చుతున్న సమయములో వారి మందిరానికి అష్టావక్రమహాముని రావడం జరిగింది. ముని కుతూహలంతో ఉపవాసానికి కారణం అడగగా, పూర్వ జన్మ జ్ఞానం కల్గిన చిత్రభానుడు విధంగా తెలిపాడు. పూర్వజన్మమున చిత్రభానుడు, సుస్వరుడనే వేటగాడు. జంతు పక్ష్యాయదులను చంపి అమ్ముకొనే వృత్తి చేయువాడు. ఒక రోజు వేట చేస్తూ అడవిలో సంచరిస్తూండగా బాగా చీకటి పడిపోయింది. తను ఒక లేడిని చంపినా ఇంటికి తీసుకెళ్ళే విధానం చీకటిలో తోచలేదు. ఇక ఏమి చెయ్యలేక, రాత్రికి ఒక బిల్వ వృక్షముపై తలదాచుకున్నాడు. ఆకలి దప్పికలతో బాధించిన వాడై, రాత్రంతా మేలుకొనే ఉన్నాడు. తన భార్య బిడ్డలు తిండి లేక యెంత బాధపడుతున్నారో తలచుకొని రోదించాడు. రాత్రి నిద్ర పొతే ఎక్కడ జంతువుల పాలు పడే ప్రమాదం ఉన్నదోనని నిద్ర రాకుండడానికి బిల్వ పత్రాలను ఒకటి ఒకటి తుంచి చెట్టు కిందకు వేయడం మొదలుపెట్టాడు. తెల్లవారిన తర్వాత తను చంపిన జంతువుని అమ్మి, ఆహారమును కొనుక్కొని, ఇంటికి తెరిగి వెళ్ళాడు. తను ఆహారం తీసుకొనడానికి ఉపక్రమించిన సమయంలో ఇంటి బయట అన్నార్తుడై ఒక వ్యక్తి రాగా, దయ కలిగినవాడై, ముందు అతడికి ఇచ్చి తర్వాత తను తిన్నాడు.
వేటగాడు చనిపోవుకాలం ఆసన్నమైనప్పుడు, శివదూతలు అతడి ఆత్మను శివలోకానికి తోడుకొని పోయారు. అక్కడ అతడికి తను అడవిలో చిక్కుకొన్న రోజున చేసుకున్న పుణ్యం తెలిసి వచ్చింది. బిల్వ వృక్షం కింద ఒక లింగం ఉంది. వేటగాడు తన కన్నీరుతో స్వామికి తెలియకనే అభిషేకం చేసాడు. బిల్వపత్రాలను వదిలి పూజ చేసాడు. అన్నపానీయాలు లేక ఉపవాసం ఉన్నాడు. రాత్రి మహాశివ రాత్రి. మర్నాడు వేరొకరికి ఆహరం సమర్పించి తను సేవించాడు.
శివ రాత్రి విశిష్టతను స్వయంగా స్వామే పార్వతీదేవికి ఇలా వివరించాడు - "మాఘ మాసంలో పద్నాలగవ రాత్రి అయిన అమావాస్య నాకు ఎంతో ప్రీతివంతమైనది . దినమున కేవలము ఉపవాసము చేయటమే ఎన్నో స్నానములు, దానములు, పుషా, నైవేద్య సమర్పణలకన్న గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. మణులు కన్నా కొన్ని బిల్వ పత్రాలతో పూజ చేస్తే చాలును. ఉపవాసము ఉండి, రాత్రి నాల్గుఝాములలో నాకు అభిషేకము చెయ్యాలి. మొదటిఝాము పాలతోనూ, రెండవఝాము పెరుగుతోనూ, మూడవఝాము నెయ్యితోనూ, చివరిఝాము తేనేతోనూ చేస్తే ఎంతో ఫలితము. మర్నాడు ఉదయమున, సాధువులకు ఆహారము సమర్పించి, పూజా కార్యక్రమములను పూర్తి చేసుకొని తర్వాత ఉపవాసాన్ని చాలించాలి. ఆచారాన్ని మించినది వేరొకటి లేదు!!”
రోజున స్వామిని జ్యోతిర్లింగరూపంలో సేవించడం ఆనవాయితి. రాత్రంతా జాగరణ చేసి, ఉపవాసముండి, శివ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తారు. నాల్గుఝాములు అభిషేకం చేసి, బిల్వ పత్రాలతో పూజలు విశేషంగా చేస్తారు. శివుడు సన్యాస మూర్తి. అందుకే సన్యాస దీక్షను స్వీకరించే వారు రోజున దీక్షను తీసుకుంటారు.

భారత దేశంలో ౧౨ (12) చోట్ల ద్వాదశ జ్యోతిర్లింగాలు వెలిసాయి. లింగం జ్యోతిరూపంలో వెలిసిన క్షేత్రాలివి.
·         రామనాథ ఆలయం, రామేశ్వరం, తమిళనాడు
·         మల్లికార్జునేశ్వర ఆలయం, కృష్ణా నది తీరంలో, శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్
·         భీమశంకరం, డాకిని, పూణ దగ్గర, మహారాష్ట్ర
·         త్ర్యంబకేశ్వరాలయం, గోదావరి నదీ తీరంలో, నాసిక్ దగ్గర, మహారాష్ట్ర
·         గుస్మేశ్వర ఆలయం, ఔరంగాబాద్ దగ్గర, మహారాష్ట్ర
·         ఓంకారేశ్వరాలయం, నర్మదా నదీతీరంలో, అమలేశ్వర్, మధ్యప్రదేశ్
·         సోమనాథ్ ఆలయం, సోమనాథ్, గుజరాత్
·         నాగనాథ ఆలయం, దారుకావన, ద్వారక దగ్గర, గుజరాత్
·         మహాకాళేశ్వర ఆలయము, శిప్రా నదీ తీరంలో, ఉజ్జయిని
·         కేదరేశ్వరాలయం, కేదారనాథ్, ఉత్తరాచల్
·         కాశి విశ్వనాథుని ఆలయం, వారాణసి, ఉత్తరప్రదేశ్
·         వైద్యనాధుని ఆలయం, జైసిద్ దగ్గర, బీహార్
అథర్వణ వేద సంహితలో యుప స్తంభమునకు పూజించుతూ చేసే స్తుతిలో మొట్ట మొదటి సారిగా శివ లింగం చెప్పబడింది అంటారు. యుప స్తంభం/స్కంభం ఆద్యంతరహితమైనది. పరమాత్మ రూపమైనది. అట్టి లింగోద్భవం జరిగిన రోజు శివ రాత్రి.
స్కంద పురాణం ప్రకారం రకాల శివ రాత్రులు. ప్రతీ రోజు నిత్య శివరాత్రి. ప్రతీ నెల కృష్ణ పక్ష చతుర్దశి రాత్రి, మాస శివరాత్రి. మాఘ మాసం లో ప్రథమ తిథి నుండి చతుర్దశి రాత్రి వరకు పూజలు చేసి, రాత్రి చేసేది మాఘ ప్రధమాది శివరాత్రి. మాఘమాసంలో కృష్ణ పక్ష చతుర్దశి రాత్రి చేసేది మహా శివరాత్రి..
శ్రీ రుద్రం విశిష్టత :
శత రుద్రీయం యజుర్వేదంలో భాగం. ఇది మరణాన్ని సహితం అధిగమించగల్గిన సాధనం. జన్మకు మృత్యువుకు అతీతంగా ఉండే తత్వాన్ని సూచిస్తుంది. మనిషిలో శ్వాస నింపేది మరల దానిని తీసుకుపోయేది కూడా పరమాత్మే నని తెలియజేస్తుంది. శ్రీ రుద్రాన్ని రుద్రాప్రస్న అని కూడా అంటారు. వేద మంత్రాలలో ఏంటో ఉత్కృష్టమైనది. శ్రీ రుద్రం రెండు భాగాలలో ఉంటుంది. "నమో" పదం వచ్చే మొదటి భాగం, యజుర్వేదంలో ౧౬వ అధ్యాయంలో ఉంటుంది. దీనిని నమకం అంటారు. రెండవ భాగంలో "చమే" అన్న పదం మరల మరల రావటం వాళ్ళ దీనిని చమకం అంటారు. ఇది ౧౮వ అధ్యాయంలోఉంది.
చమకం నమకం చైవ పురుష సూక్తం తథైవ |
నిత్యం త్రయం ప్రాయునజనో బ్రహ్మలోకే మహియతే ||
నమకం చమకం ఎవరైతే మూడు మార్లు పురుష సూక్తంతో ప్రతీ దినం చదువుతారో వాళ్లకు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది.
నమకం విశిష్టత :
నమకం, చమకం 11 భాగాలు ఉంటాయి. ఒకొక్క భాగాన్ని "అనువాకం" అంటారు. మొదటి అనువాకంలో పరమశివుడిని తన రౌద్ర రూపాన్ని చలించి, తన అనుచరులను, ఆయిదాలను త్యజించమని ప్రసన్నము చేసుకుంటూ ప్రార్ధించేది. శాంతించిన స్వామిని దయతల్చమని ప్రార్ధించు భావం ఉంది. పంక్తులలో ఎన్నో నిగూఢమైన రహస్యాలు దాగి ఉన్నాయి. కొన్ని ఆయుర్వేద మందులు తయారుచేయు విధానాలు కూడా కనిపిస్తాయి.
అనువాకం – 1:
తమ పాపాలను పోగొట్టి, ఆధిపత్యాన్ని, దైవం యొక్క ఆశీర్వచనం పొందేట్టుగా, చేసి, క్షామం, భయం పోవునట్టు చేసి, ఆహార, గోసంపద సమృద్ధి గావించి, గోసంపదను చావునుండి, ఇతర జంతువులనుండి, జబ్బులనుండికాపాడుతుంది. జ్వర బాధ, జబ్బులు, పిండ-మరణాలు, చెడు కర్మ, నక్షత్ర చెడు ప్రభావాలను తప్పించి, కోర్కెలు తీర్చి, సకాలంలో వానలు కురిపించి, కుటుంబాన్ని పరిరక్షించి, సంతానాన్ని ఆశీర్వదించి, ఐహిక సుఖాలను ప్రసాదించి, శత్రువులను నాశనంచేస్తుంది.
అనువాకం – 2 :
ప్రకృతిలో, సర్వ ఔషధములలో సర్వాంతర్యామి అయిన రుద్రుడికి సంసార బంధాలను సడలించమని ప్రార్ధన.. శత్రు వినాశనానికి, సంపద మరియు రాజ్యప్రాప్తికి, జ్ఞాన సాధనకు అనువాకాన్ని చదువుతారు.
అనువాకం – 3:
అనువాకంలో రుద్రుడిని ఒక చోరునిగా వర్ణిస్తుంది. అతడు సర్వాత్మ. విషయంలో మనిషి మహాస్వరూపాన్ని అర్ధం చేసుకోక నిమిత్త బుద్ధిని అలవార్చుకున్టాము, అజ్ఞానాన్ని చౌర్యం చేసి జ్ఞానం అనే వెలుగును మనలో ప్రతిష్టించుతాడు. అనువాకం వ్యాధి నివారనంకు కూడా చదువుతారు.
అనువాకం – 4:
ఇందులో రుద్రుడు సృష్టి కర్త. కారకుడు. చిన్న పెద్దా ప్రతీది అతడు చేసిన సృష్టే, అనువాకాన్ని క్షయ, మధుమేహం, కుష్టు వ్యాధి నివారణకై చదువుతారు.:
అనువాకం – 5:
అనువాకంలో రుద్రుడు పారు నీట ఉండే రూపంగా కొనియాడబడుతాడు. అతడి పంచ తత్వాలు వర్ణించబడతాయి అనగా - సృషి జరపడం, పరిరక్షించడం, నశించడం, అజ్ఞానంలో బంధింపబడడం మరియు మోక్షప్రదానం.
అనువాకం – 6:
ఇందులో రుద్రుడు కాలరూపుడు. అతడు అన్ని లోకాల కారణం, వేద రూపం మరియు వేదాంత సారం.
ఐదు ఆరు అనువాకాలు ఆస్తులు పెంపుకు, శత్రువులమీద విజయానికి, రుద్రుని వంటి పుత్రుడిని కోరుకుంటూ, గర్భస్రావం నివారించడానికి, సుఖ ప్రసవానికి , జ్యోతిష పరమైన ఇబ్బందులను నివారించడానికి, పుత్రుల పరిరక్షనకు కూడా చదువుతారు.
అనువాకం – 7:
నీటిలో, వానలో, మేఘాలలో, ఇలా అన్ని రూపాలలో ఉన్న ర్ద్రుని వర్ణిస్తుంది. అనువాకాన్ని తెలివితేటలకు, ఆరోగ్యానికి, ఆస్తిని , వారసులను పొందడానికి పశుసంపద, వస్తాలు, భూములు, ఆయుష్షు, మొక్షంకోసం కూడా చదువుతారు.
అనువాకం – 8:
ఇందులో శివుడు ఇతర దేవతలా కారకుడుగాను, వారికీ శక్తి ప్రదాతగాను వర్ణింపబడ్డాడు. యితడు అన్ని పుణ్య నదులలో ఉన్నవాడు, అన్ని పాపాలను పోగొట్టేవాడు. శత్రువులను నాశము చేసి, సామ్రాయ్జ్యాన్ని సాధించడానికి అనువాకాన్ని చదువుతారు.
అనువాకం –9:
అనువకంలో రుద్రుని శక్తి, ప్రకాశం సకల దేవతలకు శక్తిని ఇచ్చేవిగా ప్రస్తుతించబడ్డాయి. సృష్టిలో సర్వ శక్తులను శాసించే శివ స్కక్తిని మించి ఇంకొకటి లేదు. అనువాకాన్ని బంగారముకోసం, మంచి సహచారికోసం, ఉద్యోగం, ఈశ్వర భక్తుడైన పుత్రుని కోసం చేస్తారు.
అనువాకం – 10:
అనువాకంలో మల్ల రుద్రుడిని తన ఘోర రూపాన్ని ఉపసమించి, పినాకధారియైనా, అమ్బులను విడిచిపెట్టి, వ్యాఘ్ర జీనాంబరధారియై ప్రసన్నవదనంతో, దర్శనమివ్వవలసిందిగా ప్రార్ధన ఉంటుంది. అనువాకాన్ని ఐశ్వర్యం కోసం , వ్యాధినివృత్తికై, శక్తిమంతులతో వైరం పోగొట్టుటకు, భైరవ దర్శనార్ధమై, అన్నిరకముల భయములను పోగొట్టుటకు, అన్ని పాపాలను పోగొట్టుటకు చదువుతారు.
అనువాకం – 11:
అనువాకంలో రుద్రుని గొప్పతనాన్ని ప్రస్తుతించి, అతని కరుణా ప్రాప్తికై నిర్బంధమైన నమస్సులు అర్పించబడుతాయి. అనువాకాన్ని తమ సంతాన సౌఖ్యంకోసం, ఆయురారోగ్యవృద్ధి కోసం, పుణ్య తీర్తి దర్శన ఆకాంక్షతో, పూర్వ, ప్రస్తుత, వచ్చేకాలం యొక్క జ్ఞానానికి చదువుతారు.
చమకం విశిష్టత:
నమకం చదివిన తర్వాత, భక్తుడు తనే శివ రూపంగా భావించి దేవదేవుడిని తనకు సర్వం ప్రసాదించమని ప్రార్ధన చేసేది చమకం. ఇది ప్రతీ ఒక్కరికి పనికి వచ్చేది. జ్ఞానం నుండి మోక్షం కలిగే మార్గములో ప్రతీ పనిని మనిషి ఆస్వాదించి, చివరకు అంతులేని ఆనందం కలగచేసే మంత్రం. సృష్టి కర్తకు ఒక ప్రాణి నుండి ఇంకో ప్రాణికి విభేదం లేడు. సమస్తం అతనినుంది ఉద్భవించినది కనుక, మోక్ష కాంక్ష దైవత్వమునకు సూచనే.
అనువాకం – 1:
మొదటి అనువాకంలో మనిషి నవ నాడులూ జీవత్వంతో ఉట్టిపడి, జ్ఞానేంద్రియాలు స్పష్టంగా ఉండి, ఆరోగ్యముతో జీవితం కలగడానికి చేసే ప్రార్ధన.
అనువాకం – 2:
రెండవ అనువాకం నాయకత్వం, ఉచ్చ స్థానం, సామాజిక బుద్ధి, తెలివితేటలూ, ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే ఆత్మ స్థైర్యం, ప్రాపంచిక సుఖాలు, ఖ్యాతి, మరియు భగవద్జ్ఞానం కలగచేసేది.
అనువాకం – 3:
మూడవ అనువాకంలో భగవంతునికి జ్ఞానానికి ఉన్న తృష్ణ, పెంపు చేసి, అలౌకికమైన ఆనందాన్ని కలిగించి, ప్రపంచములో తన స్తితినుంది ఇంకా ఉచ్చ స్థితి అయిన భాగావద్సంనిదానాన్ని కాంక్షించేతట్టు చేస్తుంది.
అనువాకం – 4:
నాల్గవ అనువక పఠనం జీవితంలో శరీరానికి మంచి ఆహారం, ఆరోగ్యం, గౌరవం, సౌఖ్యం కలిగేటట్టు చేస్తుంది.
అనువాకం – 5:
ఐదవ అనువాకంలో నవరత్నాలని, సర్వ జీవరాశులను తన నిత్య క్రతువులకు సహాయంగా ఉండవలసిందిగా కోరుతుంది.
అనువాకం – 6:
ఆరవ అనువాకంలో హవిస్సు భాగం స్వీకరించడంలో ఇతర దేవతలలో ఇంద్రుని ప్రాముఖ్యత మరియు ఆధిపత్యం గురించి చెప్పబడింది.
అనువాకం – 7/8:
ఏడు, ఎనిమిది అనువాకములలో స్వహాకారంతో హోమ కుండంలో సమర్పించవలసిన వివిధ సమిధుల గురించి వివరింపబడింది.
అనువాకం –9:
తొమ్మిదవ అనువాకం నాలుగు వేదాల సారమైన ముఖ్యమైన ప్రార్ధన
అనువాకం – 10:
పదవ అనువాకంలో జీవుడు తన నిత్య జీవనంలో ఐశ్వర్య సంపాదనలో, క్రతువులలో సహకరించ మని సర్వ జీవరాశులను కోరుతాడు. ఇది ఒక జ్ఞాన యజ్ఞం.
అనువాకం – 11:
పదకొండవ అనువాకంలో మానవ సరిసంఖ్యకానికి దైవ బేసి సంఖ్యకానికి అనుబంధం కుదరడానికి కావలసిన శక్తిని దీవేనని కోరుకునే ప్రార్ధన.
చమకం ఐహిక సుఖానేషణ నుండి మొదలయి మొక్షాన్వేషణకు దారిచూపిస్తుంది. దైవం ఆద్యంతమైనది. అదే భూమి, ఆకాశం, కాలం, పునః మరణం, పునః జననం అన్నింటికీ కారణం, అంతం అని చెప్తుంది..