Tuesday, 20 August 2013

శ్రీకృష్ణ రక్షా మంత్ర శ్లోకము



చిన్నపిల్లలకి దృష్టి దోషాలు తగులకుండా శ్రీకృష్ణ రక్షా మంత్ర శ్లోకము:

వాసుదేవో జగన్నాథో పూతనాతర్జనో హరిః I రక్షతు త్వరితో బాలం ముంచ ముంచ కుమారకం II కృష్ణ రక్ష శిశుం శంఖ మధుకైటభమర్దన I ప్రాతస్సంగవ మధ్యాహ్న సాయాహ్నేషు చ సంధ్యయోః II
మహానిశి సదారక్ష కంసారిష్ట నిషూదన I యద్గోరజః పిశాచాంశ్చ గ్రహాన్ మాతృగ్రహానపి II బాలగ్రహాన్ విశేషేణ ఛింది ఛింది మహాభయాన్ I త్రాహి త్రాహి హరే నిత్యం త్వద్రక్షాభూషితం శుభం II

సామవేదం షణ్ముఖశర్మ గారి ఋషిపీఠం నుంచి
సాధారణంగా మంత్రమెప్పుడూ గోప్యమే! కాని ఇటువంటి మంత్రాలు ఎవరయినా పఠించచ్చు, అందుకు వీటిని ప్రముఖంగా చెప్పినా తప్పులేదు. అవసరాన్ని బట్టి ఉపయోగించుకోండి.
దీన్ని పఠించే ముందు కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుగుకోండి, తిలకం ధరించండి! దిష్టి తీయ్యాలనుకున్న పాపను చేతులోకి తీసుకోండి.విభూదిగాని, చందనంగాని చేతులో తీసుకోండి, మూడు సార్లు దీనిని పఠించండి, ఆ తర్వాత బిడ్డ ముఖాన, హృదయం, వీపు, చేతులు,ఇలా సర్వాంగాలమీద రాయండి.

No comments:

Post a Comment