Tuesday, 18 February 2014

శ్రీ గాయత్రీ


 

మంత్రాక్షరాల మహాతత్వాలు   

పరమ పవిత్రముమహా మహిమాన్వితము అయిన గాయత్రీ మంత్రంలోని 24 బీజాక్షరాలు, 24దైవీతత్వాలకు సంబంధించి ఉన్నవిఒక్కొక్క అక్షరం ఒక్కొక్క దేవత యొక్క చైతన్యశక్తి కలిగిఉన్నవి.

1. తత్ - గణపతి - విఘ్ననివారణకార్య సఫలతబుద్ధి ప్రదానం.
2.  - నార శింహుడు - పరాక్రమశక్తివీరత్వంధీరత్వంపురుషార్ధంవిజయసిద్ధి.
3. వి - విష్ణువు - స్థితికారకుడు కనుక పాలనాశక్తి కలిగిసర్వజివులను సంరక్షించిజీవికను
    ప్రసాదించును.
4. తుః - శివుడు - కళ్యాణకారకుడుఆత్మపరాయణతనిచ్చిపతనం కాకుండా కాపాడును.
5.  - కృష్ణుడు - యోగశక్తిఆత్మనిష్టవైరాగ్యంజ్ఞానంసౌందర్యంసరసత్వాదులు ప్రసాదించును.
6. రే - రాధ - ప్రేమశక్తికి అధిష్టాత్రి కనుక ప్రేమను పెంచి అసూయాద్వేషాదులు పోగొట్టును.
7. ణ్యం - లక్ష్మి - ఐశ్వర్యశక్తిధన ధాన్య వైభవ సుఖసంపదలిచ్చును.
8.  - అగ్ని - తేజోశక్తిశక్తి సామర్ధ్యాలు ప్రసాదించును.
9.  ర్గః - ఇంద్రుడు - రక్షాశక్తిరోగచోరశతృభూత ప్రేత పీడల నుండి రక్షించును.
10 దే - సరస్వతి - జ్ఞానశక్తికి అధిష్టాత్రియైజ్ఞానంవివేకందూరదర్శతబుద్ధి వికసత ప్రదానం
     చేయును.
11.  - దుర్గ - దమన శక్తియుతమైదుష్టులనుశత్రువులను నాశనం చేసిభక్తులను రక్షించి
       సమస్త విధాలైన శక్తి సామర్ధ్యాలను ప్రసాదించును.
12. స్య - హనుమంతుడు - నిష్టాశక్తికి ఆధారంనిర్భయత్వంకర్తవ్య పరాయణతవిశ్వాసం,
       బ్రహ్మచర్య పాలన శక్తి ప్రసాదించును.
13. ధీ - పృధ్వి - ధారణ శక్తికి దేవతధైర్యంగంభీరత్వంక్షమాగుణంనిరంతత్వం ప్రసాదించును.
14.  - సూర్యుడు - ప్రాణశక్తికి ఆధారంఆయురారోగ్య ప్రదాత.
15. హి - శ్రీరాముడు - మర్యాదాశక్తి కలిగిధర్మంశీలంక్షమసంయమనంమైత్రి,
      ప్రేమలనిచ్చును.
16. ధి - సీత - తపశక్తికి అధిదేవతైసాత్వికత్వంనిర్వికారత్వంఅధ్యాత్మికోన్నతికి మార్గం
       చూపించును.
17. యో - చంద్రుడు -  శాంతి శక్తి కలిగిదుఃఖంకోపంపగతృష్ణ మొదలైన వికారాలను అణచి,
      సర్వస్య శాంతినిచ్చును.
18. యోః - యముడు కాలశక్తికి అధిష్టాతస్ఫూర్తిజాగరూకతసమయ సదుపయోగంప్రదానం
      చేసి మృత్యుభయాన్ని నివారించును.
19. నః - బ్రహ్మ - సృష్ణి శక్తికి ఆధారమైన బ్రహ్మ జడ చేతవాదులను సృష్ణించి వర్ధిల్ల చేయును.
20. ప్ర - వరుణుడు - రసశక్తి కలిగిన వరుణుడుభావుకతకోమలతదయమధురత్వంసరసత,
      కళాప్రియత్వం కలిగించును.
21. చో - నారాయణుడు - ఆదర్శ శక్తికి మూలంశ్రేష్టత్వంఆకాంక్షదివ్య గుణమయుత,
      ధర్మస్వాభావం ప్రదానం చేయును.
22.  -  హయగ్రీవ - సాహస శక్తికి మూలంఉత్సాహంనిర్భయత్వంసాహసంశౌర్యధైర్యాలను
     ప్రేరేపించును.
23. యూ - హంస - వివేక శక్తియుక్తమైన హంసభవిష్యజ్ఞానంసత్సాంగత్యందూరదర్శిత్వం,
     ఉజ్వల యశస్సుఉత్కృష్టాహారంసంతోషాలనిచ్చును.
24. త్ - తులసి -సేవాశక్తికి అధిష్ట్తాత్రిసేవాబుద్ధినిఆత్మశాంతిని ఇచ్చి సత్కర్మాచరణకై     
     ప్రేరేపించును.

 24 తత్వాలకు ప్రత్యేక గాయత్రీ మంత్రాలున్నాయి.
వీరు కాక మంత్రంలోని 24  బీజాక్షరాలను ఆవహించిన కామ్య ఫలప్రదాత్రులైన 24 గురు అధిష్టాన దేవతలు వీరే.

1.  - వామదేవి
2. త్ - ప్రియా
3. స  - సత్యా
4. వి - విశ్వా
5. తు  భద్రా
6. ర్వ విభావతి
7. రే జయా
8. ణ్యం శాంతా
9. భ కాంతా
10. ర్గో దుర్గా
11. దే సరస్వతి
12. వ విద్రుమ
13. స్య విశాలా
14. ధీ వ్యాపినీ
15. మ విమలా
16. హి తమోపహారిణి
17. ధి సూక్ష్మా
18. యోః విశ్వయోని
19. యో జయా
20, న వశా
21. ప్ర పద్మాలయా
22. చో పరాశోభా
23.   - భద్రిణి
24. యాత్ - త్రిపదా

అతి శక్తివంతమైన శ్రీ గాయత్రీ మహమంత్రంలోని బీజాక్షరాల మహిమ అపారంఅనన్యం,సర్వసిద్ధిప్రదం.

1.  - అజ్ఞానాన్ని పోగొట్టునది
2. త్స - ఉపపాతకములను నివారించునది
3. వి - మహాపాతములను నివారించునది
4. తు - దుష్టగ్రహ దోషాలను నివారించునది.
5. ర్వ - భ్రూణహత్యా దోషాలను నివృత్తి చేయునది
6. రే - తెలియక చేసిన పాపాలను పోగొట్టునది
7. ణి - తినకూడని వాటిని తిన్న దోషాన్ని పరిహరించునది.
8. యం - బ్రహ్మహత్యా పాతకాన్ని నశింపచేయునది
9.  - పురుష హత్యా పాతకాన్ని పోగొట్టునది.
10. ర్గో - గోహత్యా దోషాన్ని నివృత్తి చేయునది.
11.  దే - స్త్రీహత్యా పాతకాన్ని పోగొట్టునది
12.  - గురు హత్యాపాపాన్ని నివారించును.
13,. స్య - మానసిక దోషాలను నివారించును
14. ధీ - మాతృపితృ వధా పాతకాన్ని పరిహరించును.
15.  - పూర్వ జన్మార్జిత పాపాల నుండి రక్షించును
16. హి - అనేక పాప సమూహాలను నశింపచేయును
17. ధి - ప్రాణి వధ చేసిన పాపం నుండి కాపాడును
18. యోః - సర్వపాపాలను నివృత్తి చేయును.
19. యో - సర్వపాపాలను నివృత్తి చేయును
20. నః - ఈశ్వరప్రాప్తి నిచ్చును
21. ప్ర - విష్ణులోక ప్రాప్తి
22. చో - రుద్రలోక ప్రాప్తి
23.  - బ్రహ్మలోక ప్రాప్తి
24. యాత్ - పరబ్రహ్మైక్య సిద్ధి ప్రసాదించును.

గాయత్రీ కవచంలో ఉన్న రూపాలు తానే అయిన దేవి ఇలా వర్ణించబడింది.
గాయత్రి - తూర్పు దిక్కును
సావిత్రి - దక్షిణ దిక్కును
సంధ్యాదేవి - పడమర దిక్కును
సరస్వతి - ఉత్తర దిక్కును
పార్వతి - ఆగ్నేయాన్ని
జలశాయని - నైరుతిని
పవమాన విలాసిని - వాయువ్య దిక్కును
రుద్రాణి - ఈశాన్య దిక్కును రక్షీంచుగాక
తుత్ - పాదాలను
సవితుః - జంఘలను
వరేణ్యం - కటిని
భర్గః - నాభిని
దేవస్య - హృదయాన్ని
ధీమహి - చెక్కిళ్ళను
ధియః - నేత్రాలను
యః - లలాటంను
నః - శిరస్సును
ప్రచోదయాత్ - శిఖా భాగాన్ని రక్షించుగాక.
ఇంకా వివరంగా చెప్పాలంటే మన శరీరంలోని ప్రతిభాగమ్ శ్రీ గాయత్రీ మాత రక్షణ కవచంలో భద్రంగా ఉంటాయి.

తత్ - శిరస్సు
సకారం - ఫాలం
వి - నేత్రాలు
తు - కపోలాలు
 - నాసాపుటాలు
రే - ముఖం
ణి - పైపెదవి
యం - కింది పెదవి
 - మద్య భాగం
ర్గో - చుబుకం
దే - కంఠం
 - భుజాలు
స్య - కుడి చేయి
ధీ - ఎడమ చేయి
 - హృదయం
హి - ఉదరం
ధి - నాభి
యో - కటి
యో - మర్మప్రదేశం
నః - తొడలు
ప్ర - జానువులు
చో - జంఘం
 - గుల్ఫం
యా - పాదాలు
త్ - సర్వ అంగాలు

ఈ విధంగా మన దేహంలోని సర్వ అంగాలను పరిరక్షించమని ఆ తల్లిని వేడుకుందాం.

అందుకే అనంతమైనఅంతరిక్షంలో వెలిగే జ్యోతిర్గోళలకువెలుగునిచ్చు పరంజ్యోతి గాయత్రీ మాత శక్తి అపారంఅత్యద్భుతం.
courtesy:- సిలికానాంధ్ర

No comments:

Post a Comment